
📌 Key Points
- ఇరాన్‌కు ఆయుధాలిస్తే అమెరికా వస్తువులపై 50% టారిఫ్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
- టారిఫ్‌ల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు.
- అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
- పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు జరిగాయి.
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై 50% టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు.
ట్రంప్ హెచ్చరిక: ఆయుధాలిస్తే టారిఫ్ బాదుడు
అమెరికా- ఇరాన్ (America- Iran) మధ్య రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రపంప దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే ఏ దేశానికైనా అమెరికా గట్టి గుణపాఠం చెబుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌కు ఆయుధాలను సరఫరా చేసే దేశాలు, అమెరికాకు ఎగుమతి చేసే అన్ని రకాల వస్తువులపై తక్షణమే 50 శాతం సుంకాన్ని (Tariff) విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం విషయంలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు, రాయితీలు ఉండబోవని ఆయన తేల్చి చెప్పారు. టారిఫ్‌ల పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, అమెరికా-ఇరాన్ మధ్య గంటల వ్యవధిలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఈ ప్రకటన వెలువడటం హాట్ టాపిక్‌గా మారింది. ఇరాన్ తన సైనిక బలాన్ని పెంచుకోకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ట్రంప్ ఈ ఆర్థిక అస్త్రాన్ని ప్రయోగించారు. పాకిస్థాన్ (Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో ఈ శాంతి చర్చలు ఓ కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే.
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం
మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ ప్రధాని
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ విషయంలో ఆయన అనుసరిస్తున్న కఠిన వైఖరి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.


