
📌 Key Points
- ట్రంప్ ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ చట్టం అమలు వార్షికోత్సవం సందర్భంగా స్వయంగా బర్గర్ డెలివరీ తీసుకున్నారు.
- మెక్ డొనాల్డ్స్ నుంచి బర్గర్ తెచ్చిన షారోన్ సిమ్మన్స్‌కు ట్రంప్ $100 టిప్ ఇచ్చారు.
- ఈ విధానం ద్వారా తనకు $11000 అదనపు ఆదాయం వచ్చిందని షారోన్ ట్రంప్‌కు తెలిపారు.
- డోర్‌డాష్ గ్రాండ్మాగా పాపులర్ అయిన షారోన్‌ను ట్రంప్ ఓవల్ ఆఫీస్‌కు ఆహ్వానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆశ్చర్యపరిచారు. ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ చట్టం అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, స్వయంగా బర్గర్ ఆర్డర్ చేసి, డెలివరీ తీసుకున్నారు. ఈ చర్య అందరి దృష్టిని ఆకర్షించింది.
ట్రంప్ వినూత్న ప్రదర్శన
తాను అనుకున్నది ఆచరణలో పెట్టేందుకు వినూత్న రీతిలో వ్యవహరిస్తూ అందరిని ఆశ్చర్యపరిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి తన వైవిధ్యాన్ని ప్రదర్శించారు. ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ చట్టం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ విధానం వల్ల సామాన్య కార్మికులకు చేకూరిన లబ్ధిని ప్రజలకు ప్రత్యక్షంగా చూపించేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగాడు. ఇందులో భాగంగా ఆయనే మెక్ డొనాల్డ్ నుంచి బర్గర్ ఆర్డర్ చేశారు. వచ్చిన పార్సిల్ డెలివరినీ సైతం ఆయనే స్వయంగా రిసీవ్ చేసుకున్నారు.
ట్రంప్ నుంచి అందిన ఆర్డర్‍ను డెలివరీ చేసే బాధ్యత షారోన్ సిమ్మన్స్ అనే వృద్ధురాలికి దక్కింది. పార్సిల్ బ్యాగ్‍తో షారోన్ సిమ్మన్స్ ఓవల్ ఆఫీస్‍కు రాగా ట్రంప్ స్వయంగా ఆ పార్సిన్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో ముచ్చటించిన ప్రెసిడెంట్ ఆమెకు $100 టిప్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ విధానం వల్ల తనకు ఈ ఏడాదిలో $11000 అదనపు ఆదాయం వచ్చిందని ఆమె ట్రంప్‍కు వివరించారు. షారోన్ సిమ్మన్స్ కేవలం ఒక డెలివరీ ఏజెంట్ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో ‘డోర్‌డాష్ గ్రాండ్మా’గా పాపులర్ అయ్యారు. వయస్సు పైబడినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా ఎంతో నిబద్ధతతో డెలివరీ సేవలు అందిస్తున్న ఆమెను ఓవల్ ఆఫీస్‌లోకి ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక దేశాధ్యక్షుడు స్వయంగా డెలివరీ కార్మికురాలిని కలిసి.. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం అరుదైన దృశ్యంగా నిలిచింది. ఈ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డెలివరీ ఏజెంట్‌కు టిప్ ఇచ్చిన ట్రంప్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యం
ట్రంప్ ఒక డెలివరీ కార్మికురాలిని కలిసి ఆమె యోగక్షేమాలు తెలుసుకోవడం అరుదైన విషయం. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రజలు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.


