
📌 Key Points
- టీటీడీ తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం వంటి అనేక వసతి సముదాయాలు నిర్వహిస్తోంది.
- ఏసీ గదులను ఆన్‌లైన్, రొటేషన్ విధానంలో, నాన్ ఏసీ గదులను ముందు వచ్చిన వారికి కేటాయిస్తారు.
- విష్ణునివాసంలో 408 గదులు, శ్రీనివాసంలో 552 గదులు, మాధవంలో 164 ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయి.
- తోళ్లప్ప గార్డెన్స్‌లోని 30 గదులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు; పద్మావతీ గెస్ట్ హౌస్ ప్రోటోకాల్‌కు.
తిరుమల భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేపట్టిన విస్తృత వసతి సౌకర్యాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు పాలకమండలి తీసుకుంటున్న చర్యలు, గదుల కేటాయింపు విధానాలపై ఈ కథనం విశ్లేషిస్తుంది.
టీటీడీ వసతి సముదాయాలు: పూర్తి వివరాలు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం, వైద్య తదితర సౌకర్యాలను టీటీడి అందుబాటులో ఉంచింది.
భక్తుల కోసం తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం, ఎస్వీ గెస్ట్ హౌస్, పద్మావతీ గెస్ట్ హౌస్, తిరుచానూరు తోళ్లప్ప గార్డెన్స్ వంటి వసతి సముదాయాలను టీటీడీ నిర్వహిస్తోంది. వీటితో పాటు డార్మిటరీలు, ఉచిత లాకర్లు, మరుగుదొడ్లు, స్నాన గదులు, ప్రథమ చికిత్స కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఏసీ గదులను ఆన్‌లైన్, రొటేషన్ విధానంలో భక్తులకు కేటాయిస్తున్నారు. నాన్ ఏసీ గదులను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన కేటాయిస్తున్నారు.
2011లో ప్రారంభించిన విష్ణునివాసంలో 408 గదులు, 09 హాళ్లు, 706 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ గదులను ఆన్‌లైన్ , రొటేషన్ విధానంలో భక్తులకు కేటాయిస్తున్నారు.
2003లో ప్రారంభమైన శ్రీనివాసం కాంప్లెక్స్‌లో 552 గదులు, 09 డార్మిటరీలు, 1038 లాకర్లు ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ, డీలక్స్ గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
గదుల బుకింగ్ విధానం: ఆన్‌లైన్ vs కరెంట్ బుకింగ్
2009లో ప్రారంభించిన మాధవం గెస్ట్ హౌస్‌లో 164 ఏసీ గదులు, డీలక్స్ సూట్లు ఉన్నాయి.
1955లో నిర్మించిన ఎస్వీ గెస్ట్ హౌస్‌లో ఏసీ, నాన్ ఏసీ కలిపి 31 గదులను భక్తులకు కేటాయిస్తున్నారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన గదులను కేటాయిస్తున్నారు.
రేణిగుంట సమాచార కేంద్రంలో 4 గదులు, 1 డార్మిటరీ, 18 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. 2002లో ప్రారంభమైన భూదేవి కాంప్లెక్స్ లో 1 – డార్మిటరీ, 100 లాకర్లు ఉన్నాయి. తిరుచానూరు తోళ్లప్ప గార్డెన్స్‌లోని గెస్ట్ హౌస్ 1982లో భక్తులకు అందుబాటులోకి రాగా, అందులోని 30 గదులను ఆన్ లైన్ లో నిబంధనల ప్రకారం బుకింగ్ చేసుకోవచ్చు. తిరుపతి శ్రీ పద్మావతీ గెస్ట్ హౌస్ 1979లో భక్తులకు అందుబాటులోకి రాగా, అందులో ఉన్న 35 గదులు ప్రోటోకాల్ ప్రతినిధులకు కేటాయిస్తున్నారు.
విష్ణునివాసం, శ్రీనివాసం, తోళ్లప్ప గార్డెన్స్‌లలో అన్నప్రసాదం సౌకర్యం కూడా భక్తులకు అందుబాటులో ఉంది. వీటితో పాటు శ్రీ గోవిందరాజ స్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న భవనాలు పూర్తి అయితే మరిన్ని వసతి గదులు, లాకర్లు, డార్మిటరీలు భక్తులకు అందుబాటులో రానున్నాయి.
భవిష్యత్ వసతి ప్రణాళికలు: కొత్త నిర్మాణాలు
తిరుపతి లోని విష్ణునివాసంలో పరిమిత సంఖ్యలో గదుల కేటాయింపు కరెంట్ బుకింగ్ లో మినహా, తిరుపతిలోని మిగిలిన అన్ని చోట్ల నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో www.ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో ముందస్తుగా భక్తులు బుక్ చేసుకోవాలి. ఒంటరి, అవివాహిత స్త్రీ, పురుష జంటలకు గదులు కేటాయింపు ఉండదు.
భక్తులు టీటీడీ కల్పిస్తున్న వసతి, లాకర్, విశ్రాంతి, అన్నప్రసాదాలు సదుపాయాలను వినియోగించుకుని స్వామివారి దర్శనాన్ని పూర్తి చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. దర్శనం అనంతరం గదులు, లాకర్లు వెంటనే ఖాళీ చేసి ఇతర భక్తులకు సహకరించాలని కోరుతోంది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
టీటీడీ భక్తులకు మెరుగైన వసతి కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సౌకర్యాలను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా భక్తులు తమ యాత్రను సుఖవంతం చేసుకోవచ్చు.


