
మోహన్ లాల్ నటించిన తుడరుమ్ అనే మలయాళ థ్రిల్లర్ సినిమా 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. థియేటర్లలో అద్భుత విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది.
Key Points
230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో తుడరుమ్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
కేరళ బాక్సాఫీస్‌లో రూ. 100 కోట్లు కలెక్షన్లు సాధించిన మొదటి మలయాళ సినిమా ఇది.
మోహన్ లాల్, శోభన కాంబినేషన్లో వచ్చిన ఈ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
జియోహాట్‌స్టార్‌లో తెలుగుతో సహా అనేక భాషల్లో ఈ సినిమాను చూడవచ్చు.
తుడరుమ్ బాక్సాఫీస్ వసూళ్లు
మోహన్‌లాల్ కెరీర్‌లోనే దృశ్యం సినిమాకు స్పెషల్ ప్లేస్ ఉంది. ఆ మూవీ ఇచ్చే థ్రిల్ అలాంటిలాంటిది కాదు. ఇప్పుడు దృశ్యం సినిమాలాంటి మరో సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ ‘తుడరుమ్’. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లకు వచ్చి ప్రపంచ స్థాయిలో అదరగొట్టడమే కాకుండా కేరళ బక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు రాబట్టిన సినిమా తుడరుమ్. థియేటర్లలో అదరగొట్టిన ఈ మోహన్‌లాల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
ఓటీటీలోకి మోహన్‌లాల్ సినిమా
ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మోహన్‌లాల్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ తుడరుమ్ ’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (మే 30) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల తర్వాత ఓటీటీ లోకి వచ్చింది. పెద్దగా హైప్ లేకుండా రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. దీంతో కలెక్షన్లు కుమ్మేసింది.
ఓటీటీ విడుదల వివరాలు
బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డు నెలకొల్పిన తుడరుమ్ సినిమాను జియోహాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను అదే ఓటీటీ ప్లాట్ ఫామ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. జియోహాట్‌స్టార్‌లో ఈ రోజు నుంచి తుడరుమ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ మలయాళం తో పాటు తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ చూడొచ్చు.
తుడరుమ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు రాబట్టింది. కేరళ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న మలయాళ సినిమాగా నిలిచింది. అలాగే కేరళలో రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఫస్ట్ మలయాళం మూవీ కూడా ఇదే. కేరళలో 50 కోట్ల షేర్ సాధించిన తొలి మూవీ కూడా ఇదే కావడం విశేషం.
తుడరుమ్ కథాంశం
ఇక ప్రపంచవ్యాప్తంగా 30 రోజుల్లో ఈ సినిమా రూ.230.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. కేరళలోనే రూ.115.25 కోట్లు సొంతం చేసుకుంది. ఇండియాలో 30 రోజుల్లో సుమారు రూ.120 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది తుడరుమ్.
ఎల్2 ఎంపురాన్ తర్వాత తుడరుమ్ తో మోహన్ లాల్ వరుసగా రెండో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు. పోయిన తన ట్యాక్సీని వెతుక్కుంటూ షణ్ముగం ‘బెంజ్’ ఎంతవరకు వెళతాడు అనేది సినిమా కథాంశం. దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత మోహన్ లాల్ తో కలిసి నటి శోభన తెరపై కలిసి నటించడం విశేషం. ఈ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కు కొదవే లేదు.
మొత్తంమీద, తుడరుమ్ సినిమా బాక్సాఫీస్‌లోనూ, ఓటీటీలోనూ అద్భుతమైన విజయాన్ని సాధించింది. మోహన్ లాల్ అభిమానులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.


