|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉపాసన అరుదైన గౌరవం: ప్రెగ్నెన్సీలోనూ బిజినెస్ రంగంలో సంచలనం!

Published: 16-12-2025, 12:24 AM
ఉపాసన అరుదైన గౌరవం: ప్రెగ్నెన్సీలోనూ బిజినెస్ రంగంలో సంచలనం!
  • ఉపాసన ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డును అందుకున్నారు.
  • ప్రెగ్నెన్సీ కారణంగా అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయారు.
  • సామాజిక మాధ్యమాలలో ఈ విషయం పంచుకోవడంతో పోస్ట్ వైరల్ అయింది.
  • కవలలకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించడంతో మెగా అభిమానుల్లో ఆనందం రెట్టింపు.

మెగా కోడలు ఉపాసన కొణిదెల తాజాగా మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఉపాసన, ఈ వేడుకకు హాజరు కాలేకపోయినప్పటికీ, ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇది మెగా అభిమానులలో సంతోషాన్ని నింపింది.

అవార్డు విశేషాలు: మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ గౌరవం

Upasana : ఉపాసన కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగా ఇంటి కోడలుగా రాంచరణ్ (Ram Charan)సతీమణిగా అందరికీ ఎంతో సుపరిచితమైన ఉపాసన ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఉపాసన పలు వ్యాపారాలను చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఉపాసన కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ కావడంతో పెద్దగా బయట ఎక్కడా కనిపించలేదు.

ఇక ఉపాసన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈమె మరొక గౌరవప్రదమైన అవార్డును సొంతం చేసుకోవడంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆమె మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డును సొంతం చేసుకున్నట్టు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాను ఈ అవార్డును అందుకోవడానికి వెళ్లలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ (Pregnancy)కారణంగా ఈ వేడుకకు హాజరు కాలేకపోయానని ఉపాసన తెలియజేశారు. ఇలా మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ అవార్డును సొంతం చేసుకోవడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

ఉపాసన వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె రామ్ చరణ్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు పెళ్లయిన 11 సంవత్సరాలకు అమ్మాయి జన్మించారు. ఇక క్లిన్ కారా ప్రస్తుతం మూడు సంవత్సరాల వయసులో ఉండగానే ఉపాసన మరొక శుభవార్తను అభిమానులకు తెలియజేశారు. ఈమె మరోసారి తల్లికాబోతుందని, ఈసారి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారనే విషయాన్ని తెలియచేయడంతో మెగా అభిమానుల ఆనందం రెట్టింపు అయింది.

ప్రెగ్నెన్సీ కారణంగా గైర్హాజరు

Receiving the Most Powerful Women in Business Award by @business_today is truly humbling 🧿 @NSEIndia

Sorry, I couldn’t make it in person, unable to travel due to my pregnancy. 🤰🏼 🥰

At @_ur_life_ , our focus has always been on creating positive change mentally & physically.… pic.twitter.com/ZrInWT93QG

కవలల వార్త: మెగా అభిమానుల ఆనందం

— Upasana Konidela (@upasanakonidela) December 15, 2025

ఇలా ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారనే విషయం ప్రకటించడంతో కచ్చితంగా ఈసారి అబ్బాయిలే పుడతారని మెగా ఇంట్లోకి వారసులు అడుగుపెట్టబోతున్నారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఉపాసన తన మామయ్య చిరంజీవికి మనవడు కావాలనే కోరికను నెరవేర్చబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అనంతరం రామ్ చరణ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది .వచ్చే ఏడాది ఉపాసన డెలివరీ ఉన్న నేపథ్యంలో ఈయన షూటింగుకు కాస్త విరామం ఇచ్చి పూర్తి సమయాన్ని తన భార్య పిల్లలతో గడపడానికే కేటాయించబోతున్నారని తెలుస్తోంది.

వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తూ, వ్యక్తిగత జీవితంలోనూ ఆనందాన్ని పంచుకుంటున్న ఉపాసన, మెగా కుటుంబానికి, అభిమానులకు గర్వకారణంగా నిలుస్తున్నారు. ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.