
📌 Key Points
- సంక్రాంతికి ముందు చిన్న సినిమాల రిలీజ్ హడావిడి.
- అవినాష్ తిరు ‘వనవీర’ జనవరి 1న విడుదల.
- ‘సైక్ సిద్ధార్థ్’ జనవరి 1న థియేటర్లలోకి.
- ‘ఫెయిల్యూర్ బాయ్స్’ కూడా జనవరి 1న రాబోతుంది.
సంక్రాంతి పెద్ద సినిమాలకు ముందే, డిసెంబర్ చివరి నెలలో అనేక చిన్న చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. గత వారం క్రిస్మస్ రిలీజ్‌లు మంచి టాక్ తెచ్చుకోగా, ఈ వారం విడుదలయ్యే సినిమాలు ఏంటి, వాటి విశేషాలు ఏంటి అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ వారం థియేటర్లలో సందడి చేసే చిత్రాలు
Upcoming Movies in Theater: ప్రతి వారం థియేటర్లలోకి బోలెడు సినిమాలో వచ్చేస్తూ ఉంటాయి. ఈ ఏడాది చివరి నెల కావడంతో డిసెంబర్ లో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిన్న సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే థియేటర్లోకి వచ్చేస్తున్నాయి.. గతవారం క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి.. కొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.. అదేవిధంగా ఈ వారం ఎలాంటి సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయో అని జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు? ఏయే సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
అవినాష్ తిరు వీధుల హీరోగా, డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘వానర’… కాదు కాదు ‘వనవీర’. మొన్నటివరకూ ‘వానర’గా ఉన్న దీని టైటిల్ ఇప్పుడు మారింది. గ్రామంలో జరిగిన పొలిటికల్ వార్, సెన్సిటివ్ ఇష్యూష్‌తో పాటు డివోషనల్ టచ్ ఇచ్చినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.. హీరోకు పొలిటిషన్స్ కు మధ్య జరిగే వార్ లాగా ఈ సినిమా స్టోరీ ఉండబోతుందని అర్థమవుతుంది.. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న థియేటర్లలోకి రాబోతుంది.
యంగ్ హీరో శ్రీనందు, యామినీ భాస్కర్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సైక్ సిద్ధార్థ్’.. లవ్, కెరీర్, బిజినెస్‌లో ఫెయిల్యూర్ అయిన ఓ సాధారణ యువకుడు చిన్న చిన్న విషయాలకే ఇరిటేట్ అవుతూ ఉంటాడు. కంప్లీట్ గా సమాజంపై ద్వేషాన్ని పెంచుకుంటాడు.. అలాంటి వ్యక్తి జీవితంలోకి వేరే అమ్మాయి వస్తుందా..? అతడి లైఫ్ ఎలా ఉంటుంది అన్నది ఈ మూవీ స్టోరీ.. ఇటీవల విడుదలైన ట్రైలర్తో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీకి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఎట్టకేలకు జనవరి 1న థియేటర్లలోకి రాబోతుంది.
తెలుగులో వస్తున్న లేటెస్ట్ సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. అవి తేజ్, క్రాంతి, ప్రదీప్, సుపర్ణ, పవన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించారు. వీఎస్ఎస్ కుమార్ నిర్మాతగా ఉన్నారు.. టైటిల్ కు తగ్గట్లుగానే ఈ సినిమా స్టోరీ ఉండబోతుందని ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అని చూస్తే అర్థమవుతుంది.. ఈ మూవీ కూడా జనవరి 1న థియేటర్లలోకి రాబోతుంది.
జనవరి 1న వస్తున్న కొత్త చిత్రాలు
సాయిచరణ్, ఉషశ్రీ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఇట్స్ ఓకే గురు’… మణికంఠ దర్శకత్వం వహించారు.. క్రాంతి ప్రసాద్ నిర్మాత.. ఇట్స్ ఓకే గురు అనేది జనాలకు ఒక మంత్రం.. ఎన్ని సమస్యలు వచ్చినా ఇట్స్ ఓకే అని ముందుకెళ్లిపోతే లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది.. ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే ఈ స్టోరీ రాబోతుంది.. మూవీ కూడా జనవరి 1న రిలీజ్ కాబోతుంది..
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర చివరి సినిమా ‘ఇక్కిస్’.. తండ్రులు తమ కుమారులను పెంచుతారు. గొప్ప వ్యక్తులు దేశాన్ని నిర్మిస్తారు. ధర్మేంద్ర గారి తనయుడిగా నటించిన హీరోది సైనికుడి పాత్ర.. తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.. ఈ మూవీ కూడా జనవరి 1న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది..
ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే సంగీత దిగ్గజం ఘంటశాల బయోపిక్‌ని వెండితెరపైకి తీసుకొస్తున్నారు… ఈ మూవీ గురించి సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చలు జరుగుతున్నాయి. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మాణ సారథ్యంలో సి.హెచ్. రామారావు రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు.. సింగర్ కృష్ణ చైతన్య, మృదుల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు..ఈ మూవీ జనవరి 2న థియేటర్లలోకి రాబోతుంది..
డిసెంబర్ చివరి వారంలో బాక్సాఫీస్ అంచనాలు
మహేంద్రన్ హీరోగా నటించిన ‘నీలకంఠ’ మూవీ. యష్నా చౌదరి, నేహా పఠాన్ హీరోయిన్లు. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ ఫేమ్ హీరోయిన్ స్నేహా ఉల్లాల్ కీలక పాత్రలో నటించింది. అలాగే మరికొంతమంది నటీనటులు కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.. ఈ మూవీ కూడా జనవరి 2న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతుంది..
ఇవే కాదు నువ్వు నాకు నచ్చావు సినిమా, వినరా ఓ వేమా, ఓ అందాల రాక్షసి, జగన్నాద్ వంటి సినిమాలు కూడా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఈవారం మొత్తంగా 11 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…
మొత్తంగా, సంక్రాంతి హడావిడికి ముందే బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. జనవరి 1న పలు ఆసక్తికర చిత్రాలు విడుదలవుతూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం సినిమా ప్రియులకు పండగే అని చెప్పొచ్చు.


