|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్: ఫేక్ యాప్స్ తో జాగ్రత్త! పోలీసులు చెప్పిన షాకింగ్ నిజాలు

Published: 16-05-2026, 5:46 AM
ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్: ఫేక్ యాప్స్ తో జాగ్రత్త! పోలీసులు చెప్పిన షాకింగ్ నిజాలు
  • ఉప్పల్‌లో SRH vs RCB మ్యాచ్‌కు భారీ డిమాండ్.
  • ఫేక్ యాప్స్, వెబ్‌సైట్ల ద్వారా టికెట్ల మోసాలు జరుగుతున్నాయి.
  • అధికారిక ‘డిస్ట్రిక్ట్’ యాప్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలి.
  • సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసుల హెచ్చరిక.

హైదరాబాద్ ఉప్పల్‌లో జరగనున్న SRH vs RCB ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల కోసం భారీ డిమాండ్ నెలకొంది. ఈ క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఫేక్ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక మార్గాల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ఐపీఎల్ టికెట్ల కోసం పెరుగుతున్న క్రేజ్

Fake IPL Ticket Apps : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 22న జరగనున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య మ్యాచ్‌కు నగరంలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. విరాట్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ క్రికెటర్ల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. అయితే…… టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న ఈ విపరీతమైన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని సొమ్ముచేసుకోవడానికి సైబర్‌ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా టికెట్ల దోపిడీకి తెరలేపారు.

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ఆకర్షణీయమైన ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ అధికారిక టికెటింగ్‌ భాగస్వామి అయిన ‘డిస్ట్రిక్ట్‌’ (District) యాప్‌ను పోలిన రంగులు, లోగోలతోనే ఈ నకిలీ యాప్‌లను, వెబ్‌సైట్లను సృష్టించడం గమనార్హం. అసలు యాప్‌కు, నకిలీ దానికి తేడా తెలియకుండా భ్రమింపజేస్తూ.. చాలా తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలతో ఊరిస్తున్నారు.

ఫేక్ యాప్స్, వెబ్‌సైట్ల ద్వారా సైబర్ మోసాలు

అచ్చం అసలు యాప్‌ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే మీ సొమ్ము గల్లంతవ్వడం ఖాయమని హైదరాబాద్ నగర పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇటువంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పేమెంట్ చేసిన తర్వాత టికెట్లు రాకపోగా.. మీ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, యూపీఐ పిన్‌లు కూడా సైబర్ నేరగాళ్ల పరమయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. దీనివల్ల మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

మ్యాచ్‌ చూడాలనే ఉత్సాహంలో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మి మోసపోవద్దని నగర సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఫేక్ యాప్ లు, వెబ్ సైట్ల కదలికలపై నిఘా ఉంచినట్లు స్పష్టం చేశారు. ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్‌సైట్ల గురించి సమాచారం గుర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. మీ కష్టార్జితాన్ని కేటుగాళ్ల పాలు చేయకుండా కేవలం అధికారిక యాప్ ద్వారానే టికెట్లను బుక్ చేసుకోవాలని క్రికెట్ ప్రియులకు విజ్ఞప్తి చేశారు.

పోలీసుల హెచ్చరికలు: ఎలా సురక్షితంగా ఉండాలి?

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

ఐపీఎల్ మ్యాచ్‌ను చూసే ఉత్సాహంలో మోసగాళ్ల వలలో పడకుండా జాగ్రత్త వహించాలి. మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను రక్షించుకోవడానికి అధికారిక యాప్‌లనే నమ్మండి. సైబర్ నేరాలపై అప్రమత్తతతోనే సురక్షితంగా ఉండగలం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.