
📌 Key Points
- ఇరాన్ యుద్ధం నేపధ్యంలో యూరియా ఉత్పత్తిలో భారీ తగ్గుదల!
- దేశవ్యాప్తంగా యూరియా ఉత్పత్తి 50% కి పడిపోయింది.
- ఖరీఫ్ సీజన్ కోసం 180 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడే ప్రమాదం.
- ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యూరియా సరఫరాకు మోడీ ఆదేశాలు.
ఇరాన్ యుద్ధం కారణంగా భారతదేశంలో యూరియా ఉత్పత్తి భారీగా పడిపోయింది. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
భారతదేశంలో యూరియా సంక్షోభం?
ఇరాన్ యుద్ధంలో మన భారతదేశంలోని రైతులకు కష్టాలు వచ్చేలాగా కనిపిస్తున్నాయి. హర్మూజ్ జల సంధి మూతపడిన నేపథ్యంలో ఇండియాకు రావలసిన LNG ( యూరియాలో వాడే వాయువు) సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా వ్యాప్తంగా యూరియా ఉత్పత్తి 50 శాతానికి పడిపోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గ్యాస్ కొరత వల్ల గెయిల్, ఐఓసీ లాంటి సంస్థలు యూరియా ప్లాంట్లకు సప్లై కూడా పూర్తిగా తగ్గించాయి.
దీని ఫలితంగా వచ్చే ఖరీఫ్ సీజన్ కు అవసరమైన 180 లక్షల టన్నుల యూరియా లభ్యతపై ఇప్పుడు కొత్త ఆందోళన నెలకొంది. ప్రస్తుతం మన ఇండియాలో కేవలం 62 లక్షల టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో చైనా నుంచి కూడా దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే యూరియా సమస్య ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యూరియా సప్లై చేయాలని ఇప్పటికే అధికారులను ప్రధాని నరేంద్ర మోడీ అలెర్ట్ చేశారు.
దిగుమతులు నిలిచిపోవడంతో రైతుల పరిస్థితి ఏమిటి?
యుద్ధం కారణంగా ఎరువులు, ఇంధనం, నిత్యవసర వస్తువుల కొరత అసలు రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ కోసం ఎరువుల నిలువలు పెంచాలని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. విద్యుత్ కొరత రాకుండా బొగ్గు సరఫరా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ఫార్మా, కెమికల్ రంగాలకు కావాల్సిన ముడి పదార్థాల కోసం ఇతర దేశాల నుంచి ప్రత్యామ్నాయలను వెతకాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి
A post shared by Sandeepreports (@sandeepreports)
దేశంలో యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రధాని మోడీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి మెరుగు పడుతుందో లేదో వేచి చూడాలి.


