|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్: బుక్ మై షో సినాప్సిస్ లీక్.. తేరి ఛాయలు! ఫ్యాన్స్ ఆందోళన!!

Published: 06-03-2026, 4:05 AM
ఉస్తాద్ భగత్ సింగ్: బుక్ మై షో సినాప్సిస్ లీక్.. తేరి ఛాయలు! ఫ్యాన్స్ ఆందోళన!!
  • పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల దగ్గర పడుతోంది.
  • బుక్ మై షోలో సినిమా సినాప్సిస్ తేరి సినిమాను పోలి ఉండటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
  • దర్శకుడు హరీష్ శంకర్ ఇది రీమేక్ కాదని, స్ఫూర్తి మాత్రమే అని చెబుతున్నారు.
  • సినిమా టీజర్ లేదా ట్రైలర్ విడుదలయ్యాక సినాప్సిస్ మారుస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదల దగ్గర పడుతున్న వేళ, బుక్ మై షోలో కనిపిస్తున్న సినాప్సిస్ అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది. ఈ సినిమా తేరి రీమేక్ అని వస్తున్న వార్తలపై క్లారిటీ లేదు.

బుక్ మై షోలో ఉస్తాద్ భగత్ సింగ్ సినాప్సిస్

Ustaad Bhagat Singh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ కాంబోగా పేరు దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , హరీష్ శంకర్ (Harish Shankar). వీరిద్దరి కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబో తెరపైకి రావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు మార్చి 26న రావాల్సిన ఈ సినిమా వారం ముందే అనగా మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో.. అభిమానుల సందడి మొదలైంది. అయితే అటు హరీష్ శంకర్ కూడా సినిమా ప్రమోషన్స్ లో వేగంగా పాల్గొంటూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.

మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పాత్రలో పవన్ కళ్యాణ్ ను చూపించబోతున్నానని.. ముఖ్యంగా తాను పవన్ కళ్యాణ్ ను ఎలా అయితే చూపించాలని కోరుకున్నానో అలాగే చూపించబోతున్నాను అని చెప్పి మరింత అంచనాలు పెంచారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు బుక్ మై షో లో కనిపిస్తున్న సినాప్సిస్ అభిమానులను టెన్షన్ లోకి తోసేసింది.

తేరి సినిమాను పోలి ఉందంటున్న అభిమానులు

వివరాల్లోకి వెళితే.. మొదటి నుంచి ఈ సినిమా విజయ్ నటించిన తేరీ కి రీమేక్ అని వార్తలు వచ్చినా..దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఇది రీమేక్ కాదని.. కేవలం స్ఫూర్తి మాత్రమే అని చెప్పారు. కానీ బుక్ మై షో లో కనిపిస్తున్న స్టోరీ దాదాపు తేరి తరహాలోనే ఉండడంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి ఒకపక్క ఒరిజినల్ మాస్ సినిమా ఆశిస్తున్న అభిమానులకు ఇది తీవ్రంగా ఆందోళన పరిచే అంశం అని చెప్పవచ్చు. సాధారణంగా బుక్ మై షో వంటి ఫ్లాట్ ఫార్మ్స్ లో సినిమా రిలీజ్ కి ముందు కొన్ని తాత్కాలిక లైన్స్ యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది.

దర్శకుడు హరీష్ శంకర్ వివరణ

ముఖ్యంగా సినిమా టీజర్ లేదా ట్రైలర్ విడుదలయ్యాక వాటిని మారుస్తుంటారు. ఇప్పుడు ఉస్తాద్ విషయంలో కూడా అదే జరుగుతోందని.. హరీష్ శంకర్ తన మార్క్ మార్పులతో ఒక కొత్త కథని చూపిస్తారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా.. ఒకవేళ ఈ లైన్ నిజమైతే మాత్రం అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో అనే చర్చ ఇప్పుడు ట్రేడ్ వర్గాలలో మొదలయ్యింది. ఏది ఏమైనా బుక్ మై షో లో కనిపిస్తున్న ఈ సినాప్సిస్ మెగా అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మరి హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా? లేక రీమిక్స్ సినిమాలతో అభిమానులను హర్ట్ చేస్తారా అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఏది ఏమైనా బుక్ మై షోలో కనిపిస్తున్న సినాప్సిస్ మెగా అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. హరీష్ శంకర్ తన మార్క్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.