
📌 Key Points
- పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాలతో విడుదలైంది.
- సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
- ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.137 కోట్ల బిజినెస్ చేసింది, రూ.138 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది.
- మొదటి రోజు రూ.40-50 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంచనా.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి. మొదటి రోజు కలెక్షన్లపై అందరి దృష్టి ఉంది.
ఉస్తాద్ భగత్ సింగ్: అంచనాలు, టాక్
Ustaad Bhagat Singh: ఎప్పుడెప్పుడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ గురువారం భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి ఈ ఉస్తాద్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో గర్జిస్తున్నాడు? మొదటి రోజు కలెక్షన్ల లెక్కలేంటి? అసలు హిట్ అనిపించుకోవాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలి? లెక్కల్లోకి వెళ్దాం..
టాక్ చూస్తే మాస్ కు పూనకాలే.. కానీ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్, మేనరిజమ్స్ మరియు పవర్ ఫుల్ డైలాగ్స్‌తో థియేటర్లను హోరెత్తించారు. ముఖ్యంగా హరీష్ శంకర్ రాసిన పొలిటికల్ టచ్ ఉన్న డైలాగులు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. అయితే, సినిమా చూసిన సాధారణ ప్రేక్షకుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన (Mixed Talk) వినిపిస్తోంది. ఇదొక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ మూవీ అని, కథలో కొత్తదనం లేదనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ అదనపు ఆకర్షణ అయినప్పటికీ.. సెకండాఫ్‌లో సాగతీత సినిమాకు మైనస్‌గా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భారీ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్
భారీ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే? పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘ఓజీ’ క్రియేట్ చేసిన ప్రభంజనం కారణంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేట్రికల్ బిజినెస్ తెలంగాణలో 50 కోట్లు,ఆంధ్రప్రదేశ్ లో రూ.54 కోట్లుసీడెడ్ లో రూ.16 కోట్లు,ఓవర్సీస్ రూ.12 కోట్లు,కర్ణాటక & మిగిలిన ప్రాంతాలు రూ.5 కోట్లతో ఓవరాల్ గా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.137 కోట్ల భారీ బిజినెస్ జరుపుకున్నట్టు తెలుస్తుంది.అంటే, ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.138 కోట్ల షేర్ వసూలు చేయాలి. టాక్ మిక్స్‌డ్‌గా ఉన్న ఈ టైమ్ లో ఇంత పెద్ద మొత్తాన్ని రాబట్టడం ఉస్తాద్‌కు పెద్ద సవాలే అని చెప్పాలి.
మొదటి రోజు కలెక్షన్ల అంచనా.. టాక్‌తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.40 నుంచి రూ.50 కోట్ల మధ్యలో గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, లాంగ్ రన్‌లో ఈ సినిమా నిలబడాలంటే వీకెండ్ వసూళ్లు అత్యంత కీలకం. ఒకవేళ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడితే మాత్రం ఉస్తాద్ గట్టెక్కడం ఖాయం. లేదంటే మాత్రం భారీ బిజినెస్ వల్ల బయ్యర్లకు తిప్పలు తప్పవనే చర్చ నడుస్తోంది.మొత్తానికి పవర్ స్టార్ తన మేనరిజమ్స్‌తో బాక్సాఫీస్ వద్ద జాతర అయితే మొదలుపెట్టారు.. మరి ఈ జాతర ‘బ్రేక్ ఈవెన్’ వరకు సాగుతుందా లేదా అనేది చూడాలి.
మొదటి రోజు కలెక్షన్ల అంచనా
టాలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద రికార్డ్..దీన్ని టచ్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా?
మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. సినిమా నిలబడాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావాల్సిందే. వీకెండ్ వసూళ్లపైనే సినిమా భవితవ్యం ఆధారపడి ఉంది.


