
📌 Key Points
- ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.
- మల్లారెడ్డికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే ఆయనను విలన్ పాత్రకు ఎంపిక చేయలేదని హరీష్ శంకర్ తెలిపారు.
- గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది.
- ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 26న విడుదల కానుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మల్లారెడ్డిని అనుకున్నా, కొన్ని కారణాల వల్ల ఆయనను తీసుకోలేదని హరీష్ శంకర్ తెలిపారు.
ఉస్తాద్ భగత్ సింగ్ విశేషాలు
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మార్చ్ 26వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ఆరా అంటూ సాగిపోయే పాటను విడుదల చేయగా ఈ పాటకు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఈ సాంగ్ లంచ్ కార్యక్రమంలో భాగంగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఢీ కొట్టడానికి నటుడు పార్తిబన్ విలన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ముందుగా డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి మల్లారెడ్డిని సంప్రదించారట. ఇలా విలన్ పాత్రలో ఆయన నటిస్తే బాగుంటుందని హరీష్ భావించినప్పటికీ చివరి క్షణంలో మల్లారెడ్డిను వద్దనుకోవడం, తిరిగి పార్థిబన్ విలన్ గా నటించడం జరిగింది. తాజాగా హరీష్ శంకర్ మల్లారెడ్డిని విలన్ గా వద్దనుకోవడానికి గల కారణాన్ని తెలియజేశారు. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ మల్లారెడ్డి కాలేజీలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థులను ఉద్దేశించి హరీష్ శంకర్ మాట్లాడారు.
మల్లారెడ్డిని విలన్ గా ఎందుకు వద్దన్నారు?
ఈ సినిమాలో మల్లారెడ్డి గారిని విలన్ గా తీసుకుందామనుకున్నాను కానీ ఆయనకు హీరో రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అందరి దృష్టిలో ఆయన హీరో. అలా హీరోని తీసుకొచ్చి విలన్ గా చేయడం నాకు ఇష్టం లేదు అందుకే ఆయనని వద్దనుకున్నాము అంటూ ఈ సందర్భంగా హరీష్ శంకర్ మల్లారెడ్డిని విలన్ గా వద్దనుకోవడానికి గల కారణాన్ని తెలియజేశారు. మల్లారెడ్డి ఈ సినిమాలో నటించకపోయిన ఆయన పూర్తి మద్దతు మా సినిమాకు లభిస్తోందంటూ హరీష్ శంకర్ తెలిపారు. ఇక ఈ సినిమా యాక్షన్ మూవీగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
గబ్బర్ సింగ్ సక్సెస్ రిపీట్ కానుందా?
పవన్, హరీష్ కాంబినేషన్ రిపీట్!
హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సూపర్ హిట్ సినిమా తర్వాత మరోసారి మీరు ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావటంతో ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించగా, మరి ఒక హీరోయిన్ రాశి కన్నా కూడా హీరోయిన్గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా దేవి శ్రీ పసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి దేఖ్లేంగే సాల అనే పాటను విడుదల చేయక ఈ పాటకి ఎంతో మంచి ఆదరణ లభించింది ఇక తాజాగా విడుదలైన ఆరా పాట కూడా సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో ఎలా మెప్పిస్తారో చూడాలి. గబ్బర్ సింగ్ లాంటి విజయాన్ని ఈ సినిమా అందుకుంటుందో లేదో వేచి చూడాలి.


