
మహేష్ బాబు, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమా టైటిల్ తాజాగా రివీల్ అయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడు, రుద్రుడుగా డబుల్ రోల్‌లో కనిపించనున్నారు. రాజమౌళి చేసిన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
Key Points
మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ 'వారణాసి' తాజాగా రివీల్ అయ్యింది.
ప్రిన్స్ మహేష్ బాబు శ్రీరాముడు, శివుడు (రుద్రుడు) అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారని రాజమౌళి హింట్ ఇచ్చారు.
సినిమా కథ రామాయణం చుట్టూ తిరుగుతుందని, ఈవెంట్ సందర్భంగా జక్కన్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
రాముడి లాంటి ప్రశాంతమైన పాత్రకు మహేష్ సూట్ అవుతాడా అనుకుంటూనే ఫోటో షూట్ చేశామన్నారు రాజమౌళి.
‘వారణాసి’ టైటిల్ రివీల్: అంచనాలు పీక్స్
మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ సినిమా టైటిల్ ను తాజాగా రివీల్ చేశారు. రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించి, ఈ సినిమా టైటిల్ టీజర్ ను వదిలారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా కథ రామాయణం చుట్టే తిరుగుతుందట. ఇక ఈ ఈవెంట్ సందర్భంగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమాలో శ్రీరాముడిగా అదే సమయంలో శివుడిగా ప్రిన్స్ మహేష్ బాబు కనిపిస్తాడని ఎస్ఎస్ రాజమౌళి హింట్ ఇచ్చారు.
ఈ రెండు పాత్రల్లో మహేష్ బాబును చూసుకోవచ్చని తెలిపారు. ఈ సినిమా మొదలెట్టేటప్పుడు కూడా రామాయణంలో ముఖ్యమైన ఘట్టం తీస్తున్నానని అస్సలు అనుకోలేదని వ్యాఖ్యానించారు జక్కన్న. మహేష్ కృష్ణుడిగా బాగుంటాడని వివరించారు. కానీ రాముడి లాంటి ప్రశాంతమైన పాత్రకు మహేష్ సూటవుతాడా ? లేదా ? అనుకుంటూనే ఫొటో షూట్ చేశామన్నారు. కానీ అద్భుతంగా ఉందన్నాడు. ఇప్పటికి 60 రోజులు షూట్ చేశాం. ప్రతీ రోజూ.. ఒక ఛాలెంజ్ అంటూ . ఎస్.ఎస్. రాజమౌళి పేర్కొన్నారు.
శ్రీరాముడు, రుద్రుడిగా మహేష్ డబుల్ రోల్
రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు: ఛాలెంజింగ్ షూట్
మహేష్ బాబు డబుల్ రోల్, రామాయణం కథాంశంతో వస్తున్న ‘వారణాసి’ చిత్రం ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రాజమౌళి మార్క్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుండటంతో అంచనాలు పతాక స్థాయికి చేరాయి.


