|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వారణాసి సంచలనం: మహేష్ బాబు-రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ లీక్? పారిస్ లో టీజర్ అప్డేట్!

Published: 05-01-2026, 5:01 AM
వారణాసి సంచలనం: మహేష్ బాబు-రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ లీక్? పారిస్ లో టీజర్ అప్డేట్!
  • మహేష్ బాబు-రాజమౌళిల ‘వారణాసి’ సినిమా షూటింగ్ 50% పూర్తయింది.
  • సినిమా 2027 ఏప్రిల్ 27న విడుదల తేదీగా ప్రచారం జరుగుతోంది.
  • వారణాసి టీజర్ నేడు రాత్రి ప్యారిస్ లోని లే గ్రాండ్ రెక్స్ థియేటర్ లో విడుదల కానుంది.
  • ఈ సినిమా బడ్జెట్ రూ. 1300 కోట్లు కాగా, ప్రమోషన్లకు రూ. 200 కోట్లు కేటాయిస్తున్నారు.

టాలీవుడ్ లో భారీ అంచనాలున్న మహేష్ బాబు-రాజమౌళి ‘వారణాసి’ సినిమా విడుదల తేదీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2027 ఏప్రిల్ 27న విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. ఈరోజు పారిస్ లో టీజర్ విడుదల కానుండటంతో సినిమాపై ప్రపంచవ్యాప్తంగా మరింత హైప్ క్రియేట్ అవుతోంది.

వారణాసి విడుదల తేదీపై ఉత్కంఠ

Varanasi Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో వారణాసి(Varanasi) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో ఇప్పటివరకు పలువురు టాలీవుడ్ హీరోలు నటించి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే మొదటిసారి మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై గ్లోబల్ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా దాదాపు 50% షూటింగ్ పూర్తి అయ్యిందని మరొక ఆరు ఏడు నెలలలో షూటింగ్ పూర్తి అవుతుందని ఇటీవల స్వయంగా రాజమౌళి తెలియచేశారు.

ఇక ఈ సినిమా నుంచి ఇదివరకే ఒక టైటిల్ గ్లింప్ విడుదల చేయగా, ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇక ఈ సినిమాని 2027 సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్టు సంగీత దర్శకుడు కీరవాణి వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన తేదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాని 2027 ఏప్రిల్ 27వ తేదీ విడుదల చేయబోతున్నారని ఇదే తేదీని రాజమౌళి ఫిక్స్ చేశారంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. త్వరలోనే ఈ విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం.. నేడు ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ప్యారిస్ లో గ్రాండ్ టీజర్ లాంచ్

ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయబోతున్నారు అయితే ఈ టీజర్ ఎంతో విభిన్నంగా ఇండియాలో కాకుండా ప్యారిస్ లోని లే గ్రాండ్ రెక్స్ థియేటర్ లో రాత్రి 9 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానులు కూడా ఈ టీజర్ వీడియో కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి సినిమా అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. ఇక ఈయన ఇదివరకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన RRR సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో వారణాసి సినిమాపై గ్లోబల్ మీడియా కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.

గ్లోబల్ రేంజ్ లో వారణాసి..

భారీ బడ్జెట్, గ్లోబల్ అంచనాలు

ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన టైటిల్ లాంచ్ కార్యక్రమానికి ఏకంగా ఇంటర్ నేషనల్ మీడియాలు కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీజర్ ఏకంగా పారిస్ లో విడుదల చేయబోతున్న నేపథ్యంలో జక్కన్న వారణాసి సినిమాని భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని స్పష్టమవుతుంది. ఈ సినిమా కోసం ఏకంగా 1300 కోట్ల బడ్జెట్ కేటాయించబోతున్నారని, ప్రమోషన్లకు అదనంగా మరో రెండు వందల కోట్లు కేటాయించబోతున్నారని తెలుస్తోంది.. మన ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి 2027లో బిగ్గెస్ట్ సినిమాగా వారణాసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో,పృధ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించబోతున్నారు ఇప్పటివరకు ఈ ముగ్గురి పాత్రలను రివిల్ చేశారు అయితే ఈ సినిమాలో తమిళ నటుడ మాధవన్, నటుడు ప్రకాష్ రాజ్ కూడా నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ‘వారణాసి’ సినిమా విడుదల తేదీపై ఊహాగానాలు, పారిస్ లో టీజర్ లాంచ్ వంటి పరిణామాలు గ్లోబల్ స్థాయిలో అంచనాలను పెంచుతున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.