
📌 Key Points
- వరుణ్ ధావన్ ‘బోర్డర్ 2’ సినిమా షూటింగ్లో గాయపడ్డారు.
- వెన్నెముక కింది భాగం రాయికి బలంగా తగలడంతో తీవ్రమైన నొప్పిని అనుభవించారు.
- ‘బోర్డర్ 2’ చిత్రం 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో రూపొందింది.
- సినిమాలో వరుణ్ ధావన్ పడ్డ కష్టాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు.
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ‘బోర్డర్ 2’ సినిమా షూటింగ్లో గాయపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా వీడియో ద్వారా తెలియజేస్తూ, ఆ సమయంలో తాను అనుభవించిన నొప్పిని వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
బోర్డర్ 2 షూటింగ్‌లో గాయపడిన వరుణ్ ధావన్
Border 2: సాధారణంగా ఒక సినిమాను అత్యంత సహజంగా తెరకెక్కించాలి అంటే ఆ పాత్ర ఎంత బలంగా ఉన్నా సరే కష్టపడక తప్పదు. ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు హీరోలు యాక్షన్ స్టంట్స్ చేసేటప్పుడు గాయపడతారు. ఆ నొప్పిని కూడా భరించాల్సి ఉంటుంది. అలా తాను కూడా సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు గాయపడ్డానని, ఆ గాయం తాలూకా నొప్పి తనకు నరకం ఏంటో చూపించింది అంటూ తాజాగా ఒక షాకింగ్ పోస్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan).
బాలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న వరుణ్ ధావన్.. తాజాగా నటించిన చిత్రం ‘బోర్డర్ 2’. జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయం అందుకుంది. అయితే ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్ గా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ సీక్వెల్ కూడా రికార్డులు సృష్టించగలదు అని నిరూపిస్తోంది. 1971 నాటి భారత్ – పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టిస్తోంది. 1971 యుద్ద సమయంలో పాకిస్తాన్ దురాక్రమణలను భారత్ తిప్పికొడుతూ వాయు, భూతల దళాల పరాక్రమాన్ని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇందులోని ప్రతి ఘట్టం కూడా ప్రేక్షకుడిని ఆ సందర్భంలోకి తీసుకెళ్లడమే కాకుండా సైనిక దళాలు పడ్డ కష్టాలను చూసి చలించిపోతున్నారు.
అందుకే ఈ సినిమాకు సెలబ్రిటీలు, సామాన్యులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా క్యూ కడుతూ సినిమాను మరింత విజయ దిశగా నడిపిస్తున్నారు. సన్నీ డియోల్ కి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్ స్టేటస్ అందించింది అనడంలో సందేహం లేదు. ఇక అలా వరుస కలెక్షన్లతో దూసుకుపోతూ అటు కమర్షియల్ గా ఇటు కథపరంగా సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలోనే చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సమయంలోనే వరుణ్ ధావన్ కూడా ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూనే.. ఈ సినిమా షూటింగ్ సమయంలో తాము పడ్డ కష్టం గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ఒక షాకింగ్ వీడియోని షేర్ చేశారు
తీవ్రమైన నొప్పి గురించి వరుణ్ ధావన్ షాకింగ్ పోస్ట్
బోర్డర్ 2 షూటింగ్ సమయంలో తనకు తగిలిన గాయం అత్యంత తీవ్రమైనదని తెలుపుతూ.. కెమెరాకు తగలకుండా తప్పించుకునే ప్రయత్నంలో తన వెన్నెముక కింది భాగం ఒక రాయికి బలంగా కొట్టుకున్నట్లు వెల్లడించారు.. ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వీడియో రూపంలో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు..” ఈ గాయం వల్ల నా జీవితంలో అత్యంత తీవ్రమైన నొప్పిని అనుభవించాల్సి వచ్చింది. వెన్నెముక కింది భాగంలో హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. గాయమైనప్పుడు కనీసం నడవలేక పోయాను. ఆ సమయంలో నా టీం నాకు సహాయం చేసింది. నా చిత్ర బృందానికి కృతజ్ఞతలు” అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఇదే వీడియోలో వరుణ్ ధావన్, సన్నీడియోల్ యాక్షన్ సీన్ కి సంబంధించిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అనురాగ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అహాన్ శెట్టి, మోనా సింగ్, దిల్జిత్ దోసాంజ్ , సన్నీడియోల్ , సోనం బజ్వా, అన్యాసింగ్, అనురాగ్ అరోరా తదితరులు కీలకపాత్రలు పోషించారు. జెపి ఫిలిమ్స్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో వరుస కలెక్షన్లతో దూసుకుపోతోంది.
1971 యుద్ధ నేపథ్యంలో బోర్డర్ 2 చిత్రం
?utm_source=ig_web_copy_link
వరుణ్ ధావన్ సినిమా కోసం పడిన కష్టాన్ని స్వయంగా తెలియజేయడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సినిమా విజయం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


