
ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ తాజా ఇంటర్వ్యూలో తన బరువు తగ్గించుకున్న విధానం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. జిమ్‌కు వెళ్లకుండా ఆమె సాధించిన ఈ విజయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
Key Points
విద్యా బాలన్ బరువు తగ్గిన విధానం గురించి ఆసక్తికర విషయాలు
జిమ్ లేకుండా, డైటింగ్ ద్వారా బరువు తగ్గడం
న్యూట్రిషన్ గ్రూప్ సలహాలతో ఆరోగ్యకరమైన బరువు నిర్వహణ
విద్యా బాలన్ బరువు తగ్గడంపై ఆసక్తికర వ్యాఖ్యలు
స్టార్ హీరోయిన్ విద్యా బాలన్(Vidhya Balan) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘డర్టీ పిక్చర్’(Dirty Picture) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇక ఈ మూవీ తర్వాత బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’(NTR Mahanayakudu) చిత్రంలోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు బరువు తగ్గడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను నా కెరీర్ బిగినింగ్‌లో చాలా లావుగా ఉన్నావ్.. ఫిట్‌గా లేవు అనే విమర్శలు ఎదుర్కొన్నాను.
జిమ్‌కు వెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఓ ప్రముఖ న్యూట్రిషన్ గ్రూప్ సంప్రదిస్తే నేను లావు అయ్యింది ఫాట్ వల్ల కాదు అని తెలిసింది. ఇన్‌ఫ్లమేషన్ కారణంగా నేను బరువు పెరిగాను అని తెలిసింది. దీంతో ఆ న్యూట్రిషన్ గ్రూప్ సలహాలు పాటించి బరువు తగ్గాను. వ్యాయామం లేకుండా కేవలం డైటింగ్ ద్వారా బరువు తగ్గాను. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది’ అని తెలిపింది విద్య. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
జిమ్ వ్యాయామం లేకుండా బరువు తగ్గించుకున్న విధానం
ఆరోగ్యకరమైన జీవనశైలికి విద్యా బాలన్ సూచనలు
చివరగా, విద్యా బాలన్ తన బరువు తగ్గింపు అనుభవాన్ని పంచుకోవడం ద్వారా, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించింది. ఆమె అనుభవం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది.


