|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vijay Devarakonda: ఆ కథ నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదని నో చెప్పేశా.. రౌడీ హీరో షాకింగ్ కామెంట్స్

Published: 14-05-2025, 11:48 PM
Vijay Devarakonda: ఆ కథ నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదని నో చెప్పేశా.. రౌడీ హీరో షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన రౌడీ హీరో విజయ్ దేవరకొండ, తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ఒకే ఒక జీవితం’ సినిమా కథను తాను తిరస్కరించినట్లు తెలిపారు. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.

Key Points

1

విజయ్ దేవరకొండ 'ఒకే ఒక జీవితం' కథను మూడు సార్లు విన్నారు.

2

ఆ కథ తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదని భావించారు.

4

ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్డమ్' చిత్రంలో నటిస్తున్నారు.

‘ఒకే ఒక జీవితం’ కథను తిరస్కరించిన విజయ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమవుతున్న విజయ్ ఎలా అయిన మంచి విజయం సాధించాలనే తపనతో ఉన్నాడు. ఈ క్రమంలోనే గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) దర్శకత్వంలో ‘కింగ్డమ్’(Kingdom) అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోలు, సాంగ్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ఒకే ఒక జీవితం(Oke Oka Jeevitham) సినిమా కథను ముందుగా నేనే విన్నాను. కథను మూడు సార్లు విన్నాను.. నేను నటించడంతో పాటు నిర్మించాలని అనుకున్నా.. కానీ ఆ సినిమా కథ నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదేమో అనిపించింది. అందుకే నటించలేకపోయాను’ అని విజయ్ చెప్పుకొచ్చాడు. కాగా ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్(Sharwanand) హీరోగా నటించగా.. అక్కినేని అమల(Akkineni Amala) కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక దీనికి శ్రీకార్తిక్‌(Sree Karthik) దర్శకత్వం వహించారు.

బాడీ లాంగ్వేజ్‌కు సరిపోని కథ

ప్రస్తుతం ‘కింగ్డమ్’ చిత్రంతో బిజీ

విజయ్ దేవరకొండ తన నిర్ణయానికి కారణాన్ని వివరిస్తూ, తన నటనకు తగిన కథలను ఎంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. ‘కింగ్డమ్’ చిత్రంపై ఆశలు పెంచుకుంటున్నాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.