
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, అనన్య పాండేల ‘లైగర్’ ఇంటర్వ్యూ వీడియో వైరల్‌గా మారింది. ఇంటర్వ్యూలో విజయ్ చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. రష్మిక మందన్న అభిమానుల ప్రతిస్పందన చర్చనీయాంశం అయింది.
Key Points
విజయ్ దేవరకొండ, అనన్య పాండేల ‘లైగర్’ ఇంటర్వ్యూ వీడియో వైరల్.
ఇంటర్వ్యూలో అనన్యను చూసి విజయ్ కిస్ చేశాడు.
నెటిజన్లు రష్మిక గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
లైగర్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆశ్చర్యకరమైన చర్య
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో నటించిన సినిమా ‘లైగర్’(Liger). ఇక ఇందులో యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pande) హీరోయిన్‌గా నటించింది. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. ప్రజెంట్ విజయ్ ‘వీడి-12’(VD-12), ‘వీడి-14’(VD-14) అనే సినిమాలతో బిజీగా ఉన్నాడనే సంగతి తెలిసిందే. అయితే అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈ రౌడీ హీరో నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna)తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
అనన్య పాండేపై విజయ్ దేవరకొండ కిస్
వీరిద్దరు కలిసి రెండు మూడు సినిమాల్లో నటించారు. ఆ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇక వేకెషన్స్, బీచులు అని ఎక్కడికి వెళ్లిన ఇట్టే దొరికిపోవటం వీళ్ల స్పెషల్. కానీ వీరిద్దరి రిలేషన్ గురించి ఇప్పటి వరకు ఈ జంట నోరు విప్పకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలో విజయ్- అనన్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ విజయ్‌ని యాంకర్ కొంత మంది హీరోయిన్స్ నేమ్స్ చెబుతాను.. వాళ్ళని చూస్తే మీకు ఏ ఫుడ్ గుర్తుకు వస్తుందో చెప్పాలి అని అంటాడు. దానికి ఓకే చెప్పిన విజయ్‌కు.. ఫస్ట్ జాన్వీ(Janhvi Kapoor) ఫొటో చూపించగానే లడ్డు గుర్తుకు వస్తుందని అంటాడు.
సోషల్ మీడియాలో రష్మిక అభిమానుల ప్రతిస్పందన
ఆ తర్వాత సారా అలీఖాన్(Sara Alikhan) ఫొటోను చూపించగానే కుర్‌కురే అంటాడు. ఆ తర్వాత అనన్య అని అడగ్గానే.. పాప్సికల్స్ అని విజయ్ అంటాడు. అప్పుడు యాంకర్ ఏ ఫ్లేవర్ అనగానే వెనీల అని చెప్పి నాకెందుకో తనని చూసినప్పుడల్లా తన బుగ్గలమీద కిస్ చేయాలని అనిపిస్తుందని చెబుతాడు. ఇది విన్న అనన్య ఓకే యు కెన్ అంటుంది. వెంటనే మంచి చాన్స్ దొరికినట్టుగా రౌడీ హీరో ఆ యంగ్ బ్యూటీ చీక్స్ పై కిస్ చేస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో కింద నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తారు. రసికుడివే అని పాపం రష్మిక అని, వదిన చూస్తే నీ పని అంతే అని కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ, అనన్య పాండేల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రష్మిక అభిమానుల కామెంట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.


