|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆర్సీబీని అమ్మేసిన విజయ్ మాల్యా! కన్నీటి పర్యంతమైన మాజీ యజమాని!!

Published: 26-03-2026, 4:05 AM
ఆర్సీబీని అమ్మేసిన విజయ్ మాల్యా! కన్నీటి పర్యంతమైన మాజీ యజమాని!!
  • ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 16,500 కోట్లకు కొనుగోలు చేసింది.
  • విజయ్ మాల్యా 2008లో రూ. 450 కోట్లకు ఆర్సీబీని కొనుగోలు చేశారు.
  • ఆర్సీబీ తన డీఎన్ఏలో ఒక భాగమని మాల్యా భావోద్వేగంగా చెప్పారు.
  • ఆర్సీబీ విక్రయం తనకెంతో సంతృప్తినిచ్చిందని మాల్యా పేర్కొన్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ అధినేత విజయ్ మాల్యా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

ఆర్సీబీని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. గత సీజన్ వరకు ఆ జట్టు కప్ కొట్టలేదనే ఇక అపవాదు ఉండగా.. 2025 లో కప్ గెలిచి అందరి నోర్లు ముయించింది. అనంతరం 2026 సీజన్ ముందు ఎవరూ ఉహించని విధంగా.. ఆర్సీబీని కొత్త యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సరికొత్త రికార్డు సృష్టించడంపై ఆ జట్టు మాజీ అధినేత విజయ్ మాల్యా స్పందించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ (Ditya Birla Group) నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,500 కోట్లు) ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన నేపథ్యంలో విజయ్ మాల్యా (Vijay Mallya) సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం తనకెంతో సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు.

“2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు నేను రూ. 450 కోట్లకు ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాను. అప్పట్లో చాలా మంది నన్ను చూసి నవ్వారు. అదొక పనికిరాని ‘వ్యానిటీ ప్రాజెక్ట్’ అని విమర్శించారు. కానీ, నాటి రూ. 450 కోట్ల పెట్టుబడి నేడు రూ. 16,500 కోట్లకు పెరగడం చూస్తుంటే గర్వంగా ఉంది” అని మాల్యా రాసుకొచ్చారు. విమర్శల నుంచి రికార్డు స్థాయి విలువ వరకు ఆర్సీబీ ప్రయాణం అద్భుతమని కొనియాడిన ఆయన, “ఆర్సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో ఒక భాగంగానే ఉంటుంది” అంటూ జట్టుపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.

విజయ్ మాల్యా భావోద్వేగపూరిత వ్యాఖ్యలు

ఆర్సీబీతో నా అనుబంధం ఎప్పటికీ వీడదు: మాల్యా

ఆర్సీబీ తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని, దానిని ఎప్పటికీ మరచిపోలేనని విజయ్ మాల్యా అన్నారు. ఈ ఫ్రాంచైజీతో ఆయనకున్న అనుబంధాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.