|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్, రష్మికల అభిమాని కల నెరవేరింది! క్యూట్ వీడియో వైరల్!!

Published: 20-03-2026, 9:05 AM
విజయ్, రష్మికల అభిమాని కల నెరవేరింది! క్యూట్ వీడియో వైరల్!!
  • విజయ్, రష్మికల పెళ్లి తర్వాత ఒక చిన్నారి అభిమాని వారిని కలవాలని కోరింది.
  • చిన్నారి కోరికను మన్నించి విజయ్, రష్మిక ఆమెను ఇంటికి ఆహ్వానించారు.
  • రష్మిక స్వయంగా చిన్నారికి లడ్డూలు వడ్డించగా, విజయ్ పులిహోర పెట్టారు.
  • చిన్నారితో విజయ్ సరదాగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి తర్వాత ఒక బుల్లి అభిమాని వారిని కలవాలని కోరుకుంది. ఆ చిన్నారి కోరికను మన్నించి, వారిద్దరూ స్వయంగా ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చారు.

విజయ్, రష్మికల పెళ్లి వేడుక

Vijay Rashmika Fan: విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఇటీవల పెళ్లి చేసుకుని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహపు వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంఘటన తెలిసినదే. దేశవ్యాప్తంగా వీరి పెళ్లి గురించి చర్చలు జరిగాయి. అదేవిధంగా ఈ జంట పెళ్లి తర్వాత దేశవ్యాప్తంగా పలు ఆలయాలలో అన్నదాన కార్యక్రమాలు చేయడం, అభిమానులకు లడ్డూలు పంచడం జరిగింది. అదేవిధంగా వీరిద్దరు తమ అభిమానులను కలిసి వారికి మంచి ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత అభిమానులను ఆహ్వానించడంతో ఒక బుల్లి అభిమాని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో వైరల్ అయింది.

మేము కూడా విజయ్ దేవరకొండ రష్మికకు అభిమానులమే మమ్మల్ని కూడా పెళ్లికి పిలవచ్చు కదా అందరిని పెళ్లికి పిలిచారు, లడ్డూలు పెట్టారు ,అన్నదానం చేశారు. మమ్మల్ని పిలవచ్చు కదా అంటూ ఒక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త ఏకంగా విజయ్ దేవరకొండ రష్మిక దృష్టికి వెళ్లడంతో వారు స్పందిస్తూ కచ్చితంగా చిన్నారిని ఇంటికి లంచ్ కి పిలుస్తానని విజయ్ మాట ఇచ్చారు. అయితే ఎట్టకేలకు ఆ చిన్నారి విజయ్ రష్మికను కలిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా చిన్నారికి స్వయంగా రష్మిక లడ్డూలు వడ్డించగా విజయ్ దేవరకొండ తనకి ఎంతో ఇష్టమైన పులిహోర పెట్టారు.

బుల్లి అభిమాని కోరిక

విజయ్ దేవరకొండ చిన్నారిని ఎత్తుకొని తనతో సరదాగా మాట్లాడుతూ ఉన్న ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు .మేము కూడా విజయ్ దేవరకొండ రష్మికకు అభిమానులమే అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు మొత్తానికి సాధించావు అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. ఇలా తమ పెళ్లి వేడుకలో భాగంగా విజయ్ రష్మిక ఎంతోమంది అభిమానులను కలిసి స్వయంగా వారికి స్వీట్లు పంచుతూ కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.

గత కొంతకాలంగా విజయ్ రష్మిక ప్రేమలో ఉంటూ ఫిబ్రవరి 26వ తేదీ ఉదయపూర్ లో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట అభిమానులను కలవడం పలు ఆలయాలను సందర్శిస్తూ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలకు కూడా పెద్ద ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి కోసం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ జంట తిరిగి తమ సినిమాల పనులలో బిజీ కాబోతున్నారు. ఇక విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరూ ప్రస్తుతం రణబాలి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా కావటం విశేషం.

వైరల్ అవుతున్న వీడియో

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన విజయ్, రష్మికల మంచి మనస్సును అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.