|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైరల్ అప్డేట్: మీనాకు మరదలి దెయ్యం! బాలు నిప్పుల ఆర్డర్.. ఇంట్లో రచ్చ!

Published: 21-06-2026, 11:49 PM
వైరల్ అప్డేట్: మీనాకు మరదలి దెయ్యం! బాలు నిప్పుల ఆర్డర్.. ఇంట్లో రచ్చ!
  • ప్రభావతి నుండి మీనాకు ఊహించని క్షమాపణ. సత్యం అపార్థం తొలగిపోయింది.
  • సుందరి ఎంట్రీతో మీనాలో అసూయ, మరదలి దెయ్యం పట్టిందా అని చర్చ.
  • బాలు నిప్పుల ఆర్డర్, మనోజ్ కుక్కకాటుకు చెప్పు దెబ్బ ట్రీట్‌మెంట్.
  • మీనా ఇంటి బాధ్యతలు, వంట పనులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అభిమానులకు గుడ్ న్యూస్! ఈరోజు ఎపిసోడ్ ఊహించని మలుపులతో అదరహో అనిపించింది. మీనా జీవితంలో కొత్త సవాళ్లు, బాలు మాస్ యాక్షన్‌తో ఇంట్లో రచ్చరంబోలా. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

మీనాకు మరదలి దెయ్యం పట్టిందా?

Gunde Ninda Gudi Gantalu Serial June 22nd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 22వ ఎపిసోడ్ అదిరిపోయింది. మీనాకు ప్రభావతి సారీ చెబుతుంది. సత్యం అపార్థం చేసుకుంటాడు. మనోజ్‌పై కుక్కలు దాడి చేస్తాయి. సుందరి వచ్చి బావ అంటూ గోల చేస్తుంది. మీనా అసూయ పడుతుంది. బాలు నిప్పులు ఆర్డర్ పెడతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రభావతి పాపం తగులుతుందంటే.. తల్లిగా ఏం చేయనిది గుర్తు చేసి తగలవని బాలు అంటాడు. సత్యం వెళ్లిపోతాడు. మీనా భోజనం తీసుకెళ్లి ఇస్తుంది.

నేను ఈ ఇంటి కోడలిని నా బాధ్యత నేను ఎప్పటికీ మర్చిపోను. ఎలాంటి సంకోచం లేకుండా తిని ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకోండి అని మీనా అంటుంది. నేను ఎంత తప్పుగా ఆలోచించాను. క్షణం పాటు నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను అని సత్యం ఫీల్ అవుతాడు. మీనా భోజనం ఇవ్వడంతో తీసుకుని తింటాడు సత్యం. ప్రభావతి బ్యాచ్ ఆకలితో అలమటిస్తుంటే బాలు పాటలు పాడతాడు.

ఇక నీళ్లతో ఆకలి చల్లారేలా లేదని రోహిణి అంటుంది. దేవుడు వేసిన ఆకలి శిక్ష ఇది అని బాలు అంటాడు. రోహిణియే తట్టుకోవట్లేదు పాపం ఆ ముసలమ్మా ఏం తట్టుకుంటుంది అని శ్రుతి అంటుంది. ముసలమ్మా ఎవరని ప్రభావతి అంటే.. మీరే అని శ్రుతి అంటుంది. ఇంతలో మనోజ్ చిరిగిన బట్టలు, ఒంటినిండా దెబ్బలు, గాయాలతో వచ్చి అమ్మా అని పిలుస్తాడు.

దాంతో మీనా, శ్రుతి, రవి, బాలు నవ్వుతారు. పైకి మాత్రం అయ్యయ్యో అంటారు. బిర్యానీ వాసనకు వీధి కుక్కలు నా మీద ఎగబడ్డాయి, రక్కాయని మనోజ్ అంటాడు. దాంతో బాలు వచ్చి చెప్పుతో దెబ్బ కొడతాడు. ఏంట్రా ఇది అని మనోజ్ అంటే.. కుక్కకాటుకు చెప్పు దెబ్బ అని బాలు అంటాడు. రక్కాయి అన్నా కరవలేదు అని మనోజ్ అంటాడు.

కుక్కలు బట్టలు చింపినోడా.. రేయ్ కొత్త తిట్టు దొరికిందిరా అని బాలు అంటాడు. సూపర్ అన్నయ్య అన్నిటికంటే ఇదే హైలెట్ అవుతుందని రవి అంటాడు. ఇంతలో సత్యం వచ్చి ఏంట్రా ఈ అడుక్కుతునే అవతారం అని సత్యం అంటాడు. జరిగింది చెబుతాడు. బిర్యానీ వదిలేస్తే కవర్ చింపేవి నిన్ను కాదని మీనా, శ్రుతి అంటారు.

బాలు నిప్పుల ఆర్డర్: ఇంట్లో రచ్చ!

రేయ్ వదిలేయిరా. ఏంట్రా ఈ పంతం అని ప్రభావతి అంటుంది. ఆయన వదిలేసినా నేను వదలను. నన్ను డెకరేషన్‌కు వెళ్లకుండా చేసినందుకు ఎంత పని చేసినా చేయలేదని అన్నందుకు హర్ట్ అయ్యానని మీనా అంటుంది. ఇక చేసేది లేక మీనా ఇంటి పని వంట పని అన్ని చేస్తుంది. నేనే అనవసరంగా అన్నాను. డెకరేషన్‌కు వెళ్లకుండా ఆపినందుకు అన్నింటికి కలిపి సారీ అని ప్రభావతి చెబుతుంది.

దాన్ని వీడియో తీస్తాడు బాలు. రేయ్ అన్నం ఎలారా అని మనోజ్ అంటాడు. వంటగది మూసివేయబడినది అన్నాం కానీ వంట చేయలేదని అనలేదు. మీరు సరిగా చూడలేదు. అన్ని అక్కడే ఉన్నాయని మీనా అంటుంది. దాంతో కిచెన్‌లోకి మనోజ్ పరుగెత్తుతాడు. ఆ తర్వాత ప్రభావతి, రోహిణి కూడా వెళ్తారు. అక్కడే వంటలు ఉంటాయి. ఆబరాగా ముగ్గురు తింటారు.

హా మీ పెన్షన్ అంతా తీసుకుంటానని ప్రభావతి అంటుంది. ఇంతలో బావ అంటూ సుందరి వస్తుంది. మనోజ్ ముక్కు చూసి గుర్తుపట్టానని, రవిని పొట్టి బుడంకాయ్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్‌లా అయ్యావేంట్రా అంటుంది సుందరి. నువ్వేనా మా బాలు బావను చేసుకుంది. పర్లేదు బాగున్నావ్. నువ్వు చాలా లక్కీ అని సుందరి అంటుంది.

నువ్వేవరు అని మీనా అంటే.. బాలు బావను పెళ్లి చేసుకునేందుకు మిస్ అయినదాన్నని అంటుంది. రంగారావు తమ్ముడు కూతురు అని సత్యం చెబుతాడు. సుందరి వాగుతూనే ఉంటుంది. ముగ్గురికి ముగ్గురు పెళ్లిల్లు చేసుకున్నారు. ఒక్కరు కూడా పిలవలేదేంటని అడుగుతుంది. అందరిపై సెటైర్లు వేసి బాలు బావ అంటూ గట్టిగా పిలుస్తుంది సుందరి.

మీనా కంగారుపడుతుంది. భయపడుతుంది. అది చూసి అంతా నవ్వుకుంటారు. కారులో మీనా అసూయ గురించి చెబుతూ కావాలనే ఉడికించానని చెబుతుంది సుందరి. మీనా మనసు స్వచ్ఛంగా ఉంటుందని గొప్పగా చెబుతాడు బాలు. ఇంటర్వ్యూ అయిపోయేదాకా ఉంటాను అని బాలు అంటాడు. సుందరి ఎంత చెప్పిన బాలు వినడు.

సరేనని లోపలికి వెళ్తుంది సుందరి. సుందరి లవర్ వచ్చి ఇక్కడికెందుకు వచ్చావని అడుగుతాడు. వెంటనే పెళ్లి చేసుకుంటావా లేదా. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అని సుందరి అంటుంది. నాకు మా మావయ్యే అన్ని మటన్ కొట్టు మాణిక్యం. ఆయనే సంబంధాలు చూస్తున్నారని పెద్ద ట్విస్ట్ ఇస్తాడు సుందరి లవర్. అప్పుడే అక్కడికి మాణిక్యం బైక్ మీద వస్తాడు.

మనోజ్ దెబ్బలు: చెప్పు దెబ్బ ట్రీట్‌మెంట్!

ఇంతలో కిశోర్‌ను బాలు చూసి వీడేంటి ఇక్కడ ఉన్నాడని అడుగుతాడు బాలు. మీ హాస్టల్ దగ్గర వీడిని చూశాను, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా. నీకోసం వచ్చాడేమో అని డౌట్ వచ్చి అడిగానంటాడు బాలు. అమ్మో బాలు బావ మాములోడు కాదని మనసులో అనుకుని యాధృచ్చికంగా జరిగి ఉంటుందేమో అని సుందరి అంటుంది. కిశోర్ పెళ్లి గురించి మాణిక్యం మాట్లాడుతాడు.

మాణిక్యంను చూడకుండానే బాలు వెళ్లిపోతాడు. బాలును బావ అంటూ అచ్చం సుందరిలాగే ప్రవర్తిస్తుంది మీనా. అయ్యో మీనాకు మరదలి దెయ్యం పట్టిందని బాలు అంటుంది. మరదలు దెయ్య ఎందుకు అవుతుంది. ఊహ సుందరి అవుతుంది. తనతో ఎంతెంత దగ్గరిగా ఆడావు బావ. నీ పని బాగుంది బావ ఇంట్లో ఇల్లాలు కారులో ప్రియురాలు అని మీనా అంటుంది.

బాలును బావ అంటూ తెగ ఆడుకుంటుంది మీనా. ఒక్కసారిగా మీనాను హగ్ చేసుకుంటాడు బాలు. తర్వాత ఏడిపించడం ఆపిన మీనా డెకరెషన్ డబ్బులు హుండీలో వేశారా అని అడుగుతుంది. ఏదో దాంట్లో వేశానని బాలు చెబుతాడు. మరుసటి రోజు బాలు అటు ఇటు తిరుగుతుంటాడు. ఎవరికోసమో ఎదురుచూస్తుంటాడు. మనోజ్ వచ్చి అడిగితే.. బాలు గిచ్చుతాడు.

సత్యం, ప్రభావతికి కాఫీ ఇస్తుంది మీనా. మనోజ్‌కి ఇవ్వాలని తెలియదా అని ప్రభావతి అంటే.. మీరు ఇప్పుడే మలేషియా నుంచి వచ్చారా, రోహిణి వెళ్లిపోయిందా. తన భార్య లేదా. నేను పెట్టిస్తాను. వచ్చి ఇవ్వమనండి అని మీనా అంటుంది. దాంతో రోహిణిని ప్రభావతి పిలుస్తుంది. పొద్దున్నే నీ మొడుగికి టీ ఇవ్వాలని తెలియదా అని ప్రభావతి అంటుంది.

వాడేదే వాగుతున్నాడని అన్న ప్రభావతి మీనాను టీ పెట్టమంటుంది. పెట్టనుగా. నాకు లెవెల్ పెరిగిపోయిందని అందిగా. తను ఆడది కాదా, మొగుడికి టీ పెట్టదా అని మీనా అంటుంది. ఇంతలో శ్రుతి వచ్చి టీ ఇస్తావా. బిజీగా ఉన్నావా అని అంటుంది. సంస్కారం అంటే ఇది అని సత్యం అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. మీనా, బాలు, మనోజ్ మధ్య జరిగిన సంఘటనలు సీరియల్‌కు మరింత మసాలాను అద్దాయి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్‌ల కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.