|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ రన్ టైం ఫిక్స్! ఫిబ్రవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది!

Published: 05-02-2026, 9:35 AM
విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీ రన్ టైం ఫిక్స్! ఫిబ్రవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది!
  • విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్‌లో ‘ఫంకీ’ చిత్రం ఫిబ్రవరి 13న విడుదల కానుంది.
  • సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
  • భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
  • ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 8 నిమిషాలుగా లాక్ చేశారు.

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘ఫంకీ’. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రం యొక్క రన్ టైం రెండు గంటల ఎనిమిది నిమిషాలుగా నిర్ణయించబడింది.

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ విడుదల

Funky Film: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతూ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న వారిలో నటుడు విశ్వక్ సేన్ ఒకరు. ఈ నగరానికి ఏమైంది ఫలక్ నుమా దాస్, హిట్ వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న విశ్వక్ నిత్యం విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈయనకు సరైన సక్సెస్ లేకపోతే కెరియర్ ఇబ్బందులలో పడుతుందని చెప్పాలి. ఇక విశ్వక్ సినిమాలన్నీ విడుదలకు ముందు పెద్ద ఎత్తున కాంట్రవర్సీలలో నిలుస్తున్న నేపథ్యంలో సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపుతున్నాయని చెప్పాలి.

ఇకపోతే తాజాగా విశ్వక్ సేన్(Vishwak sen) డైరెక్టర్ అనుదీప్ (Anudeep)డైరెక్షన్ నటించిన చిత్రం ఫంకీ. విశ్వక్ సేన్,కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్,ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. అనుదీప్ డైరెక్షన్లో సినిమాలు అంటేనే ఎలాంటి కామెడీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే మరో క్రేజీ కామెడీ సినిమా ద్వారా ఈయన ఫిబ్రవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రం

ప్రస్తుతం డైరెక్టర్ అనుదీప్ వరుస ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారని తెలుస్తుంది ఈ సినిమాకు 2 గం 8 నిడివితో రన్ టైం లాక్ చేశారని తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయునన్నారు. ఇక విశ్వక్ చివరిగా లైలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ..

విశ్వక్ సేన్ కెరీర్ టర్నింగ్ పాయింట్?

ఈ వివాదం కారణంగా ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇక ఈ సినిమాలో విశ్వక్ అమ్మాయి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పూర్తిగా ఆయనను నిరాశపరచడంతో కొంత గ్యాప్ తర్వాత ఫంకీ అనే సినిమా ద్వారా రాబోతున్నారు. మరి ఈ సినిమాతో అయినా విశ్వక్ సక్సెస్ అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో సూపర్ హిట్ చిత్రం ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మొత్తానికి విశ్వక్ సేన్ ఫంకీ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో విశ్వక్ సేన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.