
📌 Key Points
- Vivo X200T ధర ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గి రూ. 53,199కి లభిస్తోంది.
- 50MP ప్రైమరీ కెమెరా, డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్, 6200mAh బ్యాటరీ ఉన్నాయి.
- 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ బ్రైట్‌నెస్.
- IP68/IP69 రేటింగ్, 90W వైర్డ్ ఛార్జింగ్, ఐదేళ్ల OS అప్‌డేట్స్.
Vivo X200T ఫోన్ మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజులకే భారీ ధర తగ్గింపుతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 50MP కెమెరా, డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్, 6200mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ ఇప్పుడు మరింత తక్కువ ధరకు లభిస్తోంది. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Vivo X200T: ధర, ఆఫర్ల వివరాలు
Vivo X200T : వివో లవర్స్ మీకోసం అద్భుతమైన ఆఫర్.. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన వివో X200T ఫోన్ ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో X200T ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. వివో X200Tలో 50MP ప్రైమరీ కెమెరాలో మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6200mAh బ్యాటరీని అమర్చారు. వివో X200T ఫోన్ డీల్స్, ఆఫర్లు, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వివో X200T ధర, ఆఫర్లు : వివో X200T ఫోన్ (12GB/256GB) స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 59,999 ధరకు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్లు చేస్తే రూ. 6,800 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ అప్పుడు ధర రూ. 53,199కు తగ్గుతుంది. మీ దగ్గర పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 24,700 వరకు సేవ్ చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
Read Also : Vivo X300 Ultra Review : DSLR రేంజ్ ఫోన్ వచ్చేసింది.. వివో X300 అల్ట్రా 200MP కెమెరాతో సంచలనం.. 6600mAh బ్యాటరీతో మాస్ ఎంట్రీ!
అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
వివో X200T ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : వివో X200T ఫోన్ 6.67-అంగుళాల కలర్ మాస్టర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1260×2800 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz, బ్రైట్‌నెస్ 5,000 నిట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
ఇందులో 6,200mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ OS6 పై రన్ అవుతుంది. కంపెనీ ఐదేళ్ల OS అప్‌డేట్‌లు, ఏడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ దుమ్ము, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ అందిస్తుంది.
కెమెరా, బ్యాటరీ పనితీరు అదుర్స్!
కెమెరాలు మాత్రం భలే ఉన్నాయి.. వివో X200T బ్యాక్ సైడ్ 50MP సూపర్ టెలిఫోటో కెమెరా ఉంటే.. 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఆకర్షణీయంగా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ వివో ఫోన్ 160 మిమీ పొడవు, 74.2 మిమీ వెడల్పు, 7.9 మిమీ మందం, 203 గ్రాముల బరువు ఉంటుంది.
మొత్తంగా, Vivo X200T అద్భుతమైన ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, దీర్ఘకాల బ్యాటరీతో పాటు ఇప్పుడు ఆకర్షణీయమైన ధర తగ్గింపుతో లభిస్తోంది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.


