|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అదుర్స్ 2పై వినాయక్ సంచలన ప్రకటన! సీక్వెల్ ఉంటుందా లేదా? అసలు నిజం ఇదే!

Published: 24-03-2026, 10:05 AM
అదుర్స్ 2పై వినాయక్ సంచలన ప్రకటన! సీక్వెల్ ఉంటుందా లేదా? అసలు నిజం ఇదే!
  • ఎన్టీఆర్ కెరీర్‌లో ‘అదుర్స్’ బ్లాక్‌బస్టర్ చిత్రాలలో ఒకటి.
  • కోన వెంకట్ ‘అదుర్స్ 2’ కథ సిద్ధంగా ఉందంటూ గతంలో కామెంట్ చేశారు.
  • దర్శకుడు వినాయక్ ‘అదుర్స్’ సీక్వెల్ ఆలోచన లేదని తేల్చి చెప్పారు.
  • ‘అదుర్స్’ సినిమాకు గొప్ప ఎండింగ్ ఇచ్చామని వినాయక్ తెలిపారు.

సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాల హవా నడుస్తోంది. ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన అదుర్స్ సినిమాకు సీక్వెల్ ఉంటుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై దర్శకుడు వినాయక్ క్లారిటీ ఇచ్చారు.

అదుర్స్ 2 గురించి కోన వెంకట్ కామెంట్స్

V.V Vinayak: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించగా మరికొన్ని సీక్వెల్ సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్(NTR) సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలలో అదుర్స్ సినిమా కూడా ఒకటి. డైరెక్టర్ వివి వినాయక్(V.V.Vinayak) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించారు. అప్పట్లో ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమాలో ఎన్టీఆర్ చారి పాత్రకు ఎంతో మంచి ఆదరణ ఉంది.

ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఎన్నో సందర్భాలలో ఎన్టీఆర్ అదుర్స్ సీక్వెల్ సినిమా గురించి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అదుర్స్ 2  (Adhurs 2)సినిమా ఉంటుంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే రచయిత కోన వెంకట్(Kona Venkat) సైతం ఈ సినిమా గురించి ఇటీవల బ్యాడ్ మేళం సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చాలామంది అదుర్స్ సీక్వెల్ గురించి అడుగుతున్నారని అయితే దాదాపు అరగంట సినిమాకు కథ కూడా సిద్ధంగా ఉందని, డైరెక్టర్ వివి వినాయక్, ఎన్టీఆర్ ఓకే అంటే అదుర్స్ 2 సెట్స్ పైకి వెళ్తుందని కోన వెంకట్ తెలిపారు.

వినాయక్ స్పందన: సీక్వెల్ సాధ్యమా?

ఇలా కోన వెంకట్ అదుర్స్ 2 గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ సినిమా వస్తుందని అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కోన వెంకట్ చేసిన ఈ వ్యాఖ్యలపై వినాయక్ స్పందించారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ.. అదుర్స్ సీక్వెల్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఆ సినిమా అక్కడితోనే పూర్తి అయ్యిందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో సీక్వెల్ చేయటానికి ఏమీ మిగలలేదని, ఒకవేళ బలవంతంగా సీక్వెల్ సినిమా చేయాలని ప్రయత్నం చేసినా అదుర్స్ సినిమా అంతా గొప్పగా ఏమీ ఉండదని వినాయక్ తెలిపారు.  అదుర్స్ సినిమాకు ఒక అద్భుతమైన ఎండింగ్ ఇచ్చాము అక్కడితో దానిని వదిలేయడం మంచిది అంటూ డైరెక్టర్ వినాయక్ తెలియచేయడంతో అదుర్స్ 2 ఉండదని స్పష్టమవుతుంది.

అదుర్స్ 2 సినిమా లేనట్టే..

అభిమానుల స్పందన: సీక్వెల్ పై నిరాశ

ఇలా అదుర్స్ 2 విషయంలో వివి వినాయక్ ఇంత క్లారిటీగా చెప్పడంతో స్పష్టత లేని సినిమాలను తెరకెక్కించడం కంటే వాటిని వదిలేయడమే మంచిదని అభిమానులు కూడా ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఈయన మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

దర్శకుడు వినాయక్ అదుర్స్ సీక్వెల్ గురించి స్పష్టత ఇవ్వడంతో, అభిమానులు నిరాశ చెందుతున్నారు. సీక్వెల్ లేనట్టే అని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఈ సినిమాపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.