
📌 Key Points
- రాజస్థాన్ అజ్మీర్ నార్త్‌లో రెండు నెలల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంక్ పేలిపోయింది.
- ప్రభుత్వ నిధులతో కాంట్రాక్టర్ నిర్మించిన ట్యాంక్ నాసిరకంగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది.
- ట్యాంకర్ నిర్మాణంలో అవినీతి జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
- అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్ నార్త్‌లో రెండు నెలల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ ట్యాంక్‌లో నాసిరకం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
రెండు నెలలకే పేలిన వాటర్ ట్యాంక్
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో భయానక, ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. ఇక మరికొన్ని సంఘటనలు వింతగా కూడా ఉంటాయి. అలాంటిదే తాజాగా ఓ ఘటన తెరపైకి వచ్చింది. కట్టిన రెండు నెలలకే ఓ వాటర్ ట్యాంకర్ అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
నాసిరకం నిర్మాణంతో నీరు వృథా
రాజస్థాన్ అజ్మీర్ నార్త్ లోని 80వ వార్డులో రెండు నెలల కిందట ఓ వాటర్ ట్యాంకర్ ను నిర్మించారు. ప్రభుత్వ ధనంతో ఓ కాంట్రాక్టర్ దీన్ని నిర్మించాడు. అయితే, ఈ టాంకర్ నిర్మించిన రెండు నెలలకే పేలిపోయింది. దీంతో ఈ ట్యాంకర్ లో ఉన్న నీళ్లన్నీ వృధా అవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ నిర్మించాలని ప్రభుత్వం డబ్బులు ఇస్తే.. నాసిరకంగా నిర్మాణం చేపట్టారని సీరియస్ అవుతున్నారు. ఈ వాటర్ ట్యాంకర్ కట్టడంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అవినీతిపై స్థానికుల ఆగ్రహం, చర్యలకు డిమాండ్
A post shared by ComedyCutsHub (@comedycutshub)
ప్రభుత్వ నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్ నాసిరకంగా ఉండటంతో పేలిపోయింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.


