|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Y Vijaya : వై విజయ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇంత క్లోజా.. బాలయ్య వాళ్ళ అత్తారింటికి తీసుకెళ్లి..

Published: 08-05-2025, 2:45 AM
Y Vijaya : వై విజయ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇంత క్లోజా.. బాలయ్య వాళ్ళ అత్తారింటికి తీసుకెళ్లి..

ప్రముఖ నటి వై. విజయ గారు తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాలకృష్ణ గారితో తనకున్న సన్నిహిత సంబంధం, మరియు వారి అత్తారింటికి వెళ్ళిన అనుభవం గురించి ఆమె వివరించారు.

Key Points

1

వై. విజయ ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల గురించి వెల్లడించారు.

2

బాలకృష్ణతో అనేక సినిమాల్లో నటించిన అనుభవాలను పంచుకున్నారు.

4

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న స్నేహాన్ని, అనుబంధాన్ని తెలియజేశారు.

వై. విజయ మరియు ఎన్టీఆర్ కుటుంబం

Y Vijaya : ఒకప్పుడు హీరోయిన్ గా చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో అలరిస్తున్నారు వై.విజయ. గతంలో ఎన్టీఆర్ తో హీరోయిన్ గా చేసారు వై విజయ. ఆ తర్వాత బాలయ్య సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించింది.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉందని తెలిపారు.

బాలకృష్ణతో సినిమా అనుభవాలు

వై విజయ మాట్లాడుతూ.. బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యామిలీ అందరితో నాకు మంచి అనుబంధం ఉంది. నేను 11 ఏళ్ళప్పుడు చెన్నై వెళ్ళిపోయాను. అక్కడ చినవెంపటి సత్యం గారి దగ్గర కూచిపూడి నేర్చుకోడానికి వెళ్లేదాన్ని. అక్కడికి ఎన్టీఆర్ పిల్లలు వచ్చేవాళ్ళు. అక్కడ మంచి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత బాలయ్యతోఅనేక సినిమాల్లో నటించాను.

ఒక ఆసక్తికరమైన సంఘటన

ఓ సారి రాజమండ్రిలో షూట్ జరిగితే షూట్ అయ్యాక బాలయ్య అత్తయ్య గారి ఊరు కాకినాడ కావడంతో అక్కడికి డిన్నర్ కి తీసుకెళ్లారు. షూటింగ్ లో బాలయ్యతో ఉంటే ఆయన భార్య వసుంధర, అక్క పురంధేశ్వరికి కాల్ చేసి విజయతో మాట్లాడండి అని ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు గారి భార్య భువనేశ్వరిని ఒకసారి సూపర్ మార్కెట్ లో కలిసాను. నన్ను గుర్తుపట్టి బాగా మాట్లాడింది. ఇంటికి రమ్మని పిలిచింది అంటూ ఎన్టీఆర్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది.

వై. విజయ గారు ఎన్టీఆర్ కుటుంబంతో తనకున్న అపురూపమైన బంధాన్ని, బాలకృష్ణ గారితో సినిమాల్లో పనిచేసిన అనుభవాలను, మరియు వారితో గడిపిన అపురూప క్షణాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.