|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణ్‌వీర్‌ మూవీపై యామి గౌతమ్ సంచలన రివ్యూ! ‘ధురంధర్ 2’ బ్లాక్‌బస్టరే అంటున్న బాలీవుడ్ బ్యూటీ!!

Published: 03-03-2026, 2:37 AM
రణ్‌వీర్‌ మూవీపై యామి గౌతమ్ సంచలన రివ్యూ! 'ధురంధర్ 2' బ్లాక్‌బస్టరే అంటున్న బాలీవుడ్ బ్యూటీ!!
  • రణవీర్ సింగ్ హీరోగా ధురంధర్ 2 సినిమా త్వరలో విడుదల కానుంది.
  • ఈ సినిమాను డైరెక్ట్ చేసింది యామి గౌతమ్ భర్త ఆదిత్య ధర్.
  • భారత్ సమ్మిట్ లో సినిమా గురించి యామి గౌతమ్ ఆసక్తికర వ్యాఖ్యలు.
  • మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 విడుదల కానుంది.

ప్రముఖ బాలీవుడ్ నటి యామి గౌతమ్ తన భర్త ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ చిత్రం ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉంటుందని ఆమె అన్నారు.

యామి గౌతమ్ ధురంధర్ 2 పై రివ్యూ

Yami Gautam:ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ (Aditya dhar) దర్శకత్వంలో రణవీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా, సారా అర్జున్ (Sara Arjun) హీరోయిన్ గా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్. భారీ అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని రికార్డుల సొంతం చేసుకుని ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 1400 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది . ఇక ఈ సినిమా ఒక ఇండియాలోనే కాకుండా దాదాపు 7 దేశాలలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇక దీంతో రెండో పార్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా.. తాజాగా ఈ చిత్రంపై దర్శకుడి భార్య, ప్రముఖ హీరోయిన్ యామి గౌతమ్ (Yami Gautam) తన మొదటి రివ్యూ పంచుకున్నారు.

ఇటీవల భారత్ సమ్మిట్ 2026 సదస్సులో పాల్గొన్న యామి గౌతమ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు. “నా భర్త చాలా గొప్ప సినిమాలను తీస్తున్నారు. తన వృత్తిని ఆయన ఎంతగానో ఆరాధిస్తారు. అందుకే అలాంటి చిత్రాలు తెరపై కనిపిస్తున్నాయి. నేను ధురంధర్ 2 సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక అసాధారణమైనది. ఆర్టికల్ 370 షూటింగ్లో ఉన్నప్పుడు మొదట ధురంధర్ స్క్రిప్ట్ చదివాను. చదువుతున్నంత సేపు నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ క్షణం నుంచి చాలా రోజులు నేను దేని పైన కూడా దృష్టిని కేంద్రీకరించలేకపోయాను. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది. కచ్చితంగా ఈ విషయాన్ని నేను చెప్పగలను” అంటూ యామి గౌతమ్ తన మొదటి అభిప్రాయాన్ని పంచుకున్నారు.. మొత్తానికైతే ఈమె చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.

భారత్ సమ్మిట్ 2026లో యామి కామెంట్స్

ఇకపోతే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి నిర్మాత జ్యోతి దేశ్పాండే మాట్లాడుతూ..” మొదటి భాగానికి మించి ఇది హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నాము” అంటూ ఆయన సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు. అలా మొత్తానికైతే ధురంధర్ 2 తమ మొదటి రివ్యూను పంచుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు. మరి ఈ సినిమా మొదటి భాగానికి మించి సక్సెస్ అవుతుందేమో చూడాలి.

మార్చి 19న ధురంధర్ 2 విడుదల

ఇదిలా ఉండగా మార్చి 19న విడుదల తేదీ అంటూ ప్రకటించడంతో అదే రోజు కన్నడ హీరో యశ్ , గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న టాక్సిక్ సినిమాని కూడా అదే రోజు విడుదల చేస్తున్నామని ప్రకటించడంతో ఇప్పుడు అందరి అంచనాలు ఈ రెండు చిత్రాలపైనే ఉన్నాయి ముఖ్యంగా ఈ రెండింటిలో ఏది బెడిసి కొట్టినా సరే రెండో చిత్రానికి ఊహించని ఇమేజ్ లభిస్తుందనటంలో సందేహం లేదు. మరి ఈ రెండు చిత్రాలలో ఏది మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మొత్తానికి యామి గౌతమ్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. మొదటి భాగం విజయాన్ని మించి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో చూడాలి. మార్చి 19న సినిమా విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.