|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యష్ ‘టాక్సిక్’ హక్కుల వేట: దిల్ రాజు భారీ ఎత్తున కొనుగోలు! టాలీవుడ్‌లో సంచలనం!

Published: 06-02-2026, 5:35 AM
యష్ 'టాక్సిక్' హక్కుల వేట: దిల్ రాజు భారీ ఎత్తున కొనుగోలు! టాలీవుడ్‌లో సంచలనం!
  • యశ్ టాక్సిక్ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
  • ఈ సినిమా హక్కుల కోసం దిల్ రాజు ఏకంగా 120 కోట్ల రూపాయలు వెచ్చించారు.
  • గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
  • ఈ సినిమాలో యష్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన భారీ మొత్తం వెచ్చించడం విశేషం. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

దిల్ రాజు చేతికి టాక్సిక్ హక్కులు

Toxic Film: కన్నడ స్టార్ హీరో యశ్(Yash) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచి సక్సెస్ అందుకున్న యశ్ కే జి ఎఫ్ 2 ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టించారు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు యశ్ నటించిన సినిమాలు ఏవి కూడా ప్రేక్షకుల ముందుకు రాని నేపథ్యంలో ఈయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యశ్ టాక్సిక్(Toxic) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతోందని తెలుస్తోంది.. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కైవసం చేసుకున్నారని తెలుస్తోంది. మొదటినుంచి కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కుల పై కన్నేసిన దిల్ రాజు ఏకంగా 120 కోట్ల రూపాయలకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కైవసం చేసుకున్నారని తెలుస్తోంది.

భారీ ధరకు థియేట్రికల్ రైట్స్ కొనుగోలు

ఇలా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం 120 కోట్ల రూపాయలు అంటే మామూలు డీల్ కాదనే చెప్పాలి. ఇక ఇటీవల స్టార్ హీరోల సినిమాలు విడుదల అయితే నైజం హక్కులను దిల్ రాజు కైవసం చేసుకుంటూ భారీ లాభాలను అందుకుంటున్నారు. కానీ ఈసారి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను కూడా ఈయన భారీ ధరలకు సొంతం చేసుకున్నారు. ఇక యష్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మారు మోగిపోతుంది అలాగే ఈయన సినిమా పట్ల కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న నేపథ్యంలోనే దిల్ రాజు కూడా ఇలాంటి ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఒక టీజర్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాలో యష్ జోడీగా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే .ఈమెతో పాటు నయనతార, తారాసుతారియా, రుక్మిణి వసంత్ వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా హై యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా కెవిఎన్ ప్రొడక్షన్స్ తో పాటు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మరి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా దిల్ రాజుకు ఏ విధంగా కలిసొస్తుందనేది తెలియాల్సి ఉంది.

పాన్ ఇండియా మూవీగా ‘టాక్సిక్’

మొత్తానికి యష్ సినిమా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకోవడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.