
📌 Key Points
- జగన్ మోహన్ రెడ్డికి ‘ఎవడైతే నాకేంటి’ సినిమాలో సీఎం పాత్ర కోసం అవకాశం వచ్చింది.
- జగన్ రాజకీయాల్లోకి రాకముందు ఈ ఆఫర్ ను దర్శకుడు వి. సముద్ర ఇచ్చారు.
- జగన్ సీఎం పాత్రలో నటించడానికి నిరాకరించడంతో గిరిబాబును ఎంపిక చేశారు.
- ఈ విషయం 19 ఏళ్ల తర్వాత బయటపడటంతో జగన్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఒకప్పుడు సినిమా అవకాశం వచ్చిందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. దర్శకుడు వి. సముద్ర ఈ విషయాన్ని వెల్లడించడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
జగన్ కు సినిమా అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎవరు?
Y.S.Jagan: సినిమా ఇండస్ట్రీలో కొనసాగి సెలబ్రిటీలు రాజకీయాలలోకి రావడం సర్వసాధారణం. అలాగే కొంతమంది రాజకీయ నాయకులకు కూడా సినిమాలలో కొన్ని కీలక పాత్రలలో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతారు అలాగే మరికొందరు హీరోలుగా కూడా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (Y.S.Jagan Mohan Reddy)సినిమాలలో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. రాజకీయాలలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ కలిగిన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన జగన్మోహన్ రెడ్డికి సినిమాలో అవకాశం రావడం ఏంటి? ఆయనకు సినిమా అవకాశం ఇచ్చింది ఎవరు? ఏ సినిమాలో ఛాన్స్ వచ్చింది? అనే విషయానికి వస్తే..
జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయి రాజకీయాలలోకి రాకముందు ఆయనకు ఎవడైతే నాకేంటి (evadaithe nakenti) అనే సినిమాలో అవకాశం వచ్చినట్లు ఆ సినిమా దర్శకుడు వి. సముద్ర (V.Samudra)తెలిపారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు ఈ విషయం గురించి ప్రశ్నలు ఎదురవడంతో అసలు విషయాన్ని బయట పెట్టారు. రాజశేఖర్ (Rajashekhar)హీరోగా నటించిన ఎవడైతే నాకేంటి సినిమా 2007 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులను ఈ సినిమాలో భాగం చేయాలని డైరెక్టర్ భావించారట.
‘ఎవడైతే నాకేంటి’ సినిమాలో జగన్ పాత్ర ఏమిటి?
ఈ నేపథ్యంలోనే అప్పట్లో వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈయన కథ కూడా వినిపించారట. ఈ సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి సీఎం పాత్రలో నటించమని డైరెక్టర్ కోరడంతో జగన్ మాత్రం అందుకు అంగీకరించలేదని తెలిపారు. సీఎం పాత్రలో నటించడానికి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా లేకపోవడంతో తిరిగి ఆ పాత్రలో గిరిబాబుని తీసుకున్నాము అంటూ డైరెక్టర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జగన్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
19 ఏళ్ల తర్వాత బయటపడిన నిజం..
జగన్ సినిమా ఆఫర్ ను ఎందుకు తిరస్కరించారు?
నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సినిమాలలో అవకాశం వచ్చిందా? ఈ సినిమాలో నటించి ఉంటే బాగుండేది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేయగా మరి కొందరు మాత్రం జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు మాత్రమే సూట్ అవుతారు అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ అవకాశం వచ్చిన సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా బాధ్యతలు తీసుకున్నారనే చెప్పాలి. జగన్ అప్పుడప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సమయంలో సినిమా అవకాశాలు రావడంతో రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా జగన్ జగన్మోహన్ రెడ్డికి సినిమాలలో అవకాశం వచ్చిన విషయాన్ని డైరెక్టర్ 19 ఏళ్ల తర్వాత బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చివరిగా, జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోనే కొనసాగాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆయన సినిమా ఆఫర్ ను తిరస్కరించడం సరైన నిర్ణయమేనని కొందరు భావిస్తున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


