
టాలీవుడ్ యువ నటుడు సజ్జా తేజ లక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన తాజా సినిమా ‘జాంబిరెడ్డి 2’ ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే ఏకంగా రూ.42 కోట్లకు ఓటీటీ డీల్ పూర్తి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టిస్తోంది.
Key Points
సజ్జా తేజ సినిమా 'జాంబిరెడ్డి 2'కు రూ.42 కోట్ల ఓటీటీ డీల్ ఖరారు.
సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఈ భారీ డీల్ కుదరడం విశేషం.
'హనుమాన్', 'మిరాయ్' చిత్రాల విజయాలు తేజ బ్రాండ్‌ను పెంచాయి.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
‘జాంబిరెడ్డి 2’కు ముందే భారీ ఓటీటీ డీల్
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కుర్రాడు సజ్జా తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన సజ్జా తేజ, ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయాడు. జాంబిరెడ్డి, హనుమాన్, ఇటీవల మిరాయ్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసేసాడు సజ్జా తేజ. మిరాయ్ సినిమా మొన్న రిలీజ్ అయి ప్రభంజనమే సృష్టించింది. ఊహించని దానికంటే ఎక్కువ కలెక్షన్స్ ఈ సినిమాకు వచ్చాయి. అయితే అలాంటి సజ్జా తేజకు బంపర్ ఆఫర్ తగిలింది. జాంబిరెడ్డి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సజ్జా తేజ, త్వరలోనే జాంబిరెడ్డి 2 తీయబోతున్నాడు.
సజ్జా తేజ వరుస విజయాల ప్రభావం
అయితే ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేదు. కానీ ఈ జాంబిరెడ్డి 2 సినిమాకు సంబంధించిన ఓటీటీ బిజినెస్ మాత్రం దాదాపుగా ఫినిష్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.42 కోట్లకు డీల్ సెట్ అయినట్లు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో పెద్దపెద్ద హీరోల సినిమాలనే ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. అలాంటిది ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే రూ.42 కోట్ల బిజినెస్ డీల్ జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హనుమాన్ అలాగే మిరాయ్ సినిమాతో వరుసగా హిట్లు అందుకున్న నేపథ్యంలోనే సజ్జా తేజ సినిమాకు బ్రాండ్ వచ్చిందని అంటున్నారు.
టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన బంపర్ ఆఫర్
మహేష్-జక్కన్న మూవీ నుంచి బిగ్ అప్డేట్..టైటిల్, గ్లింప్స్ లోడింగ్ !
సజ్జా తేజ వరుస విజయాలు, ముఖ్యంగా ‘హనుమాన్’, ‘మిరాయ్’ తో వచ్చిన క్రేజ్ ‘జాంబిరెడ్డి 2’ ఓటీటీ డీల్‌కు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బంపర్ ఆఫర్ తేజ కెరీర్‌కు మరింత బూస్ట్ ఇస్తుందని చెప్పొచ్చు.

