
📌 Key Points
- సునీల్ కమెడియన్ నుండి హీరోగా మారి, తర్వాత కమెడియన్ పాత్రలతోనే ఆకట్టుకుంటున్నారు.
- రవితేజతో కలిసి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో కామెడీ సన్నివేశాల్లో సునీల్ అద్భుతంగా నటించారు.
- కష్టపడే గుణమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని సునీల్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
- రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయడం కష్టమని, కష్టపడే తత్వమే తన దృష్టిలో గుడ్ పర్సన్ అని సునీల్ అన్నారు.
టాలీవుడ్ కమెడియన్ సునీల్ తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో రవితేజతో కలిసి నటించిన అనుభవం గురించి, తన సక్సెస్ సీక్రెట్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
సునీల్ సినీ ప్రస్థానం
Actor Sunil: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సునీల్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈయనకు ఏకంగా రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం లభించింది. ఇలా రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరు కూడా ఆయన డైరెక్షన్లో సినిమా చేయాలని కోరుకుంటారు. అలాంటిది సునీల్ కు పిలిచి మరి మర్యాద రామన్న సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
ఇలా ఈ సినిమా తర్వాత సునీల్ కమెడియన్ గా సినిమాలు పక్కన పెట్టి హీరోగా పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తదుపరి సునీల్ హీరోగా నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి దీంతో సునీల్ (Suneel) హీరోగా కాకుండా కమెడియన్ పాత్రల ద్వారానే మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా రవితేజ (Raviteja)హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి(BMW Film) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో రవితేజ సునీల్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం తాజాగా బ్లాక్ బాస్టర్ ప్రెస్ మీట్ అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.
రవితేజతో కలిసి పనిచేసిన అనుభవం
ఈ కార్యక్రమంలో భాగంగా సునీల్ తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సునీల్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీలో తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం కష్టపడే గుణమేనని తెలియజేశారు. మనకు సుఖాన్ని ఇచ్చేది ఎప్పుడు కూడా చెడు చేస్తుందని, కానీ ఏదైతే మనల్ని కష్టపడుతుందో అదే మనకు మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుందని సునీల్ తెలిపారు.
రవితేజ ఎనర్జీని మ్యాచ్ చెయ్యలేం..
సక్సెస్ గురించి సునీల్ ఎమోషనల్ కామెంట్స్
తనను కష్టపెట్టే గుణమే ఈ స్థాయిని, గుర్తింపును ఇచ్చిందని పేర్కొన్నారు. తన దృష్టిలో కష్టపడే తత్వమే గుడ్ పర్సన్ అంటూ సునీల్ ఈ సందర్భంగా కాస్త ఎమోషనల్ అయ్యారు. సునీల్ ఇలా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సునీల్ చెప్పింది అక్షర సత్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రవితేజ గురించి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రవితేజతో తనకు చాలా మంచి రిలేషన్ ఉందని, ఎప్పుడు నేను ఖాళీగా ఉన్న రవితేజ గారి దగ్గరికి వెళ్లి అతని ఆయనతోనే సమయం గడుపుతూ ఉంటానని, రవితేజ మోస్ట్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్, ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టమని రవితేజకు ఒక సెంటిమెంట్ క్యారెక్టర్ ఇచ్చిన ఫ్లో మాత్రం తగ్గదు అంటూ రవితేజ గురించి కూడా సునీల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సునీల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కష్టపడే తత్వమే తన విజయానికి కారణమని ఆయన నమ్మకం నిజమని చాలామంది అభిప్రాయపడుతున్నారు.


