
📌 Key Points
- నటి హేమ తన భర్తతో విడిపోయారనే వార్తలను ఖండించారు.
- 25 ఏళ్లుగా తమ వివాహ బంధం సంతోషంగా కొనసాగుతోందని ఆమె తెలిపారు.
- కూతురు ఈషా పెళ్లి గురించి వస్తున్న రూమర్స్‌ను హేమ కొట్టిపారేశారు.
- తన కూతురు ఒక సామాన్య అమ్మాయిలా ఆటోలో ఆఫీసుకు వెళుతుందని హేమ చెప్పారు.
నటి హేమ తన భర్తతో విడిపోయారనే వార్తలపై స్పందించారు. ఈ రూమర్స్‌ను ఖండిస్తూ, తన వైవాహిక జీవితం గురించి ఆమె క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా, తన కూతురు ఈషా పెళ్లి గురించి కూడా ఆమె పలు విషయాలు వెల్లడించారు.
విడాకుల వార్తలపై హేమ క్లారిటీ
Actress Hema:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సొంతం చేసుకున్న నటి హేమ(Hema ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సహజమైన నటనతో మంచి మార్కులు వేయించుకున్న ఈమె.. అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఇటు లేడీ కమెడియన్ గా ఎన్నో విభిన్న పాత్రలు పోషించింది. సినిమాల ద్వారా తన పాత్రలతో ఎంత పేరైతే తెచ్చుకుందో అదే సమయంలో తన అభిప్రాయాలను నేరుగా, బహిరంగంగా చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా తన భర్తకు దూరంగా ఉంటోందని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది హేమ.
హేమ మాట్లాడుతూ..” గత కొన్ని రోజులుగా నా వ్యక్తిగత జీవితంపై పలు రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నేను నా భర్త నుంచి విడిపోయాననే వార్తలు వినిపించడం నాకు బాధగా అనిపించింది. మాకు పెళ్లయి 25 సంవత్సరాలు దాటింది. ఆయన ఎప్పుడూ నాకు సపోర్టుగానే నిలిచారు. నా భర్త ముస్లిం . కానీ పబ్లిక్ ఈవెంట్స్ కి ఎక్కువగా రాకపోవడం వల్లే.. ఆయన ఎక్కువగా మీకు కనిపించరు. భార్యాభర్తలు విడిపోవచ్చు కానీ తల్లి కొడుకుల బంధం లాంటిది మా మధ్య ఉంది” అంటూ భావోద్వేగంగా మాట్లాడింది హేమ మొత్తానికైతే తన భర్తకు దూరంగా ఉంటోంది అంటూ వస్తున్న వార్తలపై ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది హేమ.
కూతురు పెళ్లి గురించి హేమ ఏమన్నారంటే?
హేమ తన కూతురు పెళ్లి గురించి కూడా ప్రస్తావించింది. “ప్రస్తుతం నా కూతురు ఈషా వయసు ఇంకా 24 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడే పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదు. కనీసం 26 ఏళ్లు వచ్చిన తర్వాతే సంబంధాలు చూస్తాను” అంటూ క్లియర్ గా చెప్పేసింది. ఇక మొత్తానికైతే హేమ కూతురు ఈషా ఒక స్టార్ హీరో ఇంటికి కోడలు కాబోతోంది అంటూ వచ్చిన వార్తలకు పూర్తిగా చెక్ పెట్టింది హేమ. అలాగే తనకు ఎలాంటి అల్లుడు కావాలి అనే విషయం గురించి మాట్లాడుతూ.. ఒక మంచి వ్యక్తి అయితే చాలు.. అది ఇండస్ట్రీలోనా లేక బయట వ్యక్తా అనే కండిషన్ ఏం లేదు అంటూ తన ఆలోచనలను వెల్లడించింది.
సాధారణ జీవితం గడుపుతున్న హేమ కూతురు
అలాగే తన కూతురు ఈషా ప్రవర్తన గురించి , ఆమె జీవన విధానం గురించి పలు విషయాలు చెప్పుకొచ్చింది హేమ. “ఈషా ఎప్పుడూ కూడా ఒక సెలబ్రిటీ కిడ్ లాగా ప్రవర్తించలేదు. తను ఒక సామాన్య అమ్మాయిలాగే జీవిస్తోంది. జాబ్ చేస్తోంది. ప్రతిరోజు ఆటోలోనే ఆఫీస్ కి వెళ్లి వస్తుంది. బిజినెస్ చేయాలని తను చాలా కోరుకుంటుంది. కానీ ముందుగా ఉద్యోగం చేస్తే జీవితాన్ని అర్థం చేసుకుంటుంది.. ముఖ్యంగా ఒక ఉద్యోగి ఎలా ఫీలవుతాడు. ఒక బాస్ ఎలా ఆలోచిస్తాడు అనే అనుభవం రావడం కోసమే మేమే జాబ్ చేయమని ప్రోత్సహించాము..ఇంట్లో పనులు కూడా చాలా చక్కగా చేస్తుంది. నేను షూటింగ్లో బిజీగా ఉంటే వంట చేసి పంపిస్తుంది ” అంటూ హేమ తన కూతురి గురించి చెప్పుకొచ్చింది.. మొత్తానికైతే ఒక సెలబ్రిటీ కిడ్ అయినప్పటికీ ఒక సామాన్య అమ్మాయిలాగే అన్ని పనులలో చురుకుగా ఉండడం చూసి ఇటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.
హేమ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు గట్టిగా సమాధానం ఇచ్చారు. తన కుటుంబం గురించి, కూతురి భవిష్యత్తు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


