|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నటి రివా అరోరాకు షాకింగ్ అనుభవం! డెలివరీ బాయ్ వేధింపులు, పోలీసుల జోక్యం.

Published: 08-05-2026, 6:01 AM
నటి రివా అరోరాకు షాకింగ్ అనుభవం! డెలివరీ బాయ్ వేధింపులు, పోలీసుల జోక్యం.
  • నటి రివా అరోరాకు బ్లింకిట్ డెలివరీ బాయ్ నుండి వేధింపులు ఎదురయ్యాయి.
  • డెలివరీ సమయంలో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు.
  • రివా తల్లి, సోదరితోనూ దురుసుగా ప్రవర్తించిన డెలివరీ బాయ్.
  • ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా, తక్షణమే చర్యలు తీసుకున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటి రివా అరోరాకు షాకింగ్ అనుభవం ఎదురైంది. బ్లింకిట్ డెలివరీ బాయ్ ఒకరు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో, రివా తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

డెలివరీ బాయ్ తో చేదు అనుభవం

Film industry:సినిమా సెలబ్రిటీలకు అటు ఇండస్ట్రీలోనే కాదు ఇటు పబ్లిక్ ప్రదేశాలలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది ఆకతాయిలు పాపులారిటీ అవ్వడం కోసం సెలబ్రిటీలను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పబ్లిక్ లోకి రావాలి అంటే కూడా సెలబ్రిటీలు భయపడుతున్నాం అంటూ ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు పోలీసులను ఆశ్రయించారు. అందులో భాగంగానే తాజాగా ఇప్పుడు ఒక నటి కూడా తనతో అసభ్యకరంగా, దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు ఫైల్ చేయాలి అంటూ పోలీసులను ఆశ్రయించింది .ఆమె ఎవరు ? అసలు ఏం జరిగిందో? ఇప్పుడు చూద్దాం..

ఆమె ఎవరో కాదు రివా అరోరా.. బాలీవుడ్లో ఉరి, గుంజన్ సక్సేనా వంటి చిత్రాలతో ఊహించని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకి తాజాగా ఊహించని పరిణామం ఎదురైంది.. ఏప్రిల్ 26న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో నిత్యవసర సరుకులు అందించే బ్లింకిట్ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి వింతగా ప్రవర్తించారట . మొదట డెలివరీ ఇచ్చేటప్పుడే అతడి మాట తీరు బాగోలేదని. తన తల్లి నిషా అరోరా వారించినా.. అతడు పట్టించుకోలేదు అంటూ తెలిపింది.

కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు

ఇకపోతే ఆ డెలివరీ బాయ్ అక్కడితో ఆగకుండా తిరిగి వెళుతున్న సమయంలో కూడా లిఫ్ట్ దగ్గర రివా సోదరి ముస్కాన్ అరోరాకి కూడా ఎదురయ్యాడు. అక్కడ కూడా ఆమెను రెచ్చగొట్టేలా అసభ్యకరమైన భాషలో మాట్లాడడంతో పరిస్థితి కాస్త విషమించింది. ఎటువంటి కారణం లేకుండా తమపై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ తమను సుమారుగా 40 నిమిషాల పాటు వేధింపులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపోతే అతడు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే రివా కుటుంబ సభ్యులు కిందకు వెళ్లి అతడిని అడ్డుకున్నారు.

ముంబై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిపై చర్యలు తీసుకున్నారు. ఇకపోతే సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయి తమకు అండగా నిలిచారని, అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది కూడా తమకు తోడుగా నిలిచారు అని వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు పోలీసులతో పాటు ఈ కామర్స్ సంస్థ బ్లింకిట్ కి కూడా ఫిర్యాదు చేశామని, వారి నుంచి వచ్చే స్పందన కోసం ఎదురుచూస్తున్నామని ఈ ముద్దుగుమ్మ తెలిపింది. ఇకపోతే ఎటువంటి కారణం లేకుండా ఈమెతో దుర్భాషలాడాడు అంటే కేవలం గుర్తింపు కోసమే అయి ఉంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు . మరి అసలు విషయం ఏంటో పోలీసుల దర్యాప్తులో తేలనుంది.

పోలీసుల తక్షణ స్పందన

ఇక రివా మాట్లాడుతూ..” వస్తువులను చేరవేయడమే కాదు కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలి అనే అంశంపై కూడా డెలివరీ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలి. ముఖ్యంగా నియమించుకునేటప్పుడే కఠినమైన తనిఖీలు చేసి వారిని నియమించుకోవాలి. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. చిన్న విషయమే కదా అని, అసభ్య ప్రవర్తనను భరించకూడదు. ముఖ్యంగా మనం గొంతు ఎత్తినప్పుడే వ్యవస్థలో కూడా మార్పు వస్తుంది. ఇకపై మరెవరికి ఇలాంటి ఘటనలు ఎదురు కాకూడదని నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను” అంటూ తెలిపింది. మొత్తానికైతే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

సెలబ్రిటీలకు కూడా ఇలాంటి వేధింపులు ఎదురవడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు, ఈ-కామర్స్ సంస్థలు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మహిళలకు భద్రత కల్పించాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.