|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉదయ్ కిరణ్ పెళ్లి నచ్చలేదన్న సుధ.. షాకింగ్ నిజాలు వైరల్!

Published: 21-02-2026, 7:35 AM
ఉదయ్ కిరణ్ పెళ్లి నచ్చలేదన్న సుధ.. షాకింగ్ నిజాలు వైరల్!
  • ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ముందు నటి సుధతో విషాదకర సంభాషణలు!
  • విశిత కిరణ్‌ను ఉదయ్ పెళ్లి చేసుకోవడం సుధకు ఇష్టం లేదు – అసలు కారణం ఇదే!
  • ఉదయ్ కిరణ్ ఉంటే నా ఆస్తులు దక్కేవి – సుధ సంచలన వ్యాఖ్యలు!
  • స్టార్ సెలెబ్రిటీ కుమార్తెతో పెళ్లి ఆగిపోయింది: అందుకే ఉదయ్ జీవితంలో విషాదం!

టాలీవుడ్ విషాద గాథల్లో ఉదయ్ కిరణ్ మరణం ఒకటి. తాజాగా నటి సుధ ఉదయ్ కిరణ్ గురించి సంచలన విషయాలు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఉదయ్ కిరణ్ చివరి రోజులు: సుధతో విషాద సంభాషణలు

ఉదయ్ కిరణ్ జీవితం విషాదంగా ముగిసింది. ఉదయ్ కిరణ్ 2014లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడంపై ఎన్నో రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే, శ్రీరామ్, నీ స్నేహం ఇలా చాలా చిత్రాల్లో నటి సుధ నటించారు. సుధా, ఉదయ్ కిరణ్ మధ్య తల్లి కొడుకుల బంధం ఏర్పడింది.

ఒక దశలో ఉదయ్ కిరణ్ ని నటి సుధ దత్తత తీసుకోవాలని కూడా చూశారు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. నటి సుధ మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ ఆత్మ హత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు చాలా బాధపడ్డాడని, తన దగ్గర కూర్చుని ఏడ్చాడని సుధ తెలిపారు.

ఆస్తి నష్టం: ఉదయ్ ఉంటే ఆస్తులు దక్కేవి!

నా ఆస్తులు చాలా పోయాయి. ఉదయ్ కిరణ్ ని నా సొంత బిడ్డ అనుకున్నా. ఉదయ్ కిరణ్ ఉండి ఉంటే నా ఆస్తులు నాకు దక్కేవి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు నడిసముద్రంలో చిక్కుకుపోయినట్లు అనిపిస్తున్నాయి. ఆ సమయంలో ఏదైనా ఆసరా దొరికితే దానిని పట్టుకుని ఒడ్డుకు వెళ్లొచ్చు అనే నమ్మకం ఉంటుంది. అలాంటి నమ్మకం నాకు ఉదయ్ కిరణ్ పై ఉండేది అని సుధ అన్నారు.

ఉదయ్ కిరణ్ పెళ్ళికి కూడా నేను వెళ్ళలేదు. నన్ను ఇన్వైట్ చేశాడు. అయినా వెళ్ళలేదు. ఎందుకంటే ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఉదయ్ కిరణ్ కి ఆ అమ్మాయి సెట్ కాదు అని తనకు ముందే అనిపించింది అని సుధ అన్నారు. ఏదో తేడాగా జరుగుతోంది అని అప్పుడే అనుకున్నట్లు సుధా తెలిపారు.

విశితతో పెళ్లి ఇష్టం లేదు: సుధ సంచలన వ్యాఖ్యలు

ఉదయ్ కిరణ్ 2012లో విశిత కిరణ్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అంతకు ముందు ఉదయ్ కిరణ్ పెళ్లి విషయంలో చాలా చర్చ జరిగింది. ఉదయ్ కిరణ్ ఓ స్టార్ సెలెబ్రిటీ కుమార్తెని వివాహం చేసుకోవాల్సింది అంటూ వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు.

ఉదయ్ కిరణ్ గురించి నటి సుధ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.