
📌 Key Points
- సీనియర్ నటి వాసవి (పద్మ) క్యాన్సర్‌తో కన్నుమూశారు.
- ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో కళ్యాణి సహాయం కోసం పోస్ట్ చేసింది.
- విజయనగరంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
- ఆమె చివరిగా ‘బహిర్భూమి’ సినిమాలో నటించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి వాసవి (పద్మ), వాహినిగా సుపరిచితులు, క్యాన్సర్‌తో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆమె మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
క్యాన్సర్‌తో పోరాడుతూ నటి వాహిని కన్నుమూత
Actress Vahini: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.. సీనియర్ నటి వాసవి (పద్మ) అనారోగ్యంతో కన్నుమూశారు… గత కొన్ని రోజులుగా ఈ నటి క్యాన్సర్ తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవడంతో ఆమె అనారోగ్యానికి ఆర్థిక సాయం కోసం సినీ నటి కళ్యాణి ఆ మధ్య పోస్టు పెట్టింది.. ఆమె ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేసినా సరే పెద్దగా ఫలించలేదు అని కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.. ఆమె చనిపోయిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వార్తతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గొప్ప నటిని మిస్ అయినట్లు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెడుతున్నారు.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆమెకు నివాళులర్పించారు.. నేడు విజయనగరంలోనే ఆమె అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం.. ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు బంధువులు హాజరుకానున్నట్లు తెలుస్తుంది.
ఆర్థిక సహాయం కోసం ప్రయత్నాలు విఫలం
గత కొన్నేళ్లుగా రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న వాహిని.. కొంతకాలంగా ఈమె నటనకు దూరంగా ఉంటున్నారు. చివరగా ఆమె ‘బహిర్భూమి’ అనే సినిమాలో కనిపించారు.. ఆ తర్వాత పలు సీరియల్స్లలో నటించింది. ఈమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనారోగ్య సమస్యలతో పోరాడుతూ ఉంది. ఆర్థిక సాయం కోసం ప్రయత్నించారు కానీ ఆమె ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయారు.. క్యాన్సర్ తో పోరాడుతూ నటి మృతి చెందిందన్న వార్త తెలియడంతో పలువురు సినీ నటులు, ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.. ప్రస్తుతం కరాటే కళ్యాణి పోస్ట్ వైరల్ గా మారింది.
విజయనగరంలో వాహిని అంత్యక్రియలు
https://www.facebook.com/share/p/17QsvcvrvG/
నటి వాహిని మృతి టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.


