
📌 Key Points
- ఎన్టీఆర్ ‘అదుర్స్’ సీక్వెల్ గురించి కోన వెంకట్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
- దర్శకుడు వి.వి. వినాయక్ సీక్వెల్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని కోన వెంకట్ తెలిపారు.
- తారక్ కమిట్మెంట్స్ తర్వాత సీక్వెల్ చేద్దామని చెప్పినట్టు కోన వెంకట్ వెల్లడించారు.
- ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు.
ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం అదుర్స్ సీక్వెల్ గురించి నిర్మాత కోన వెంకట్ చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
అదుర్స్ 2 పై కోన వెంకట్ కామెంట్స్
Adhurs 2: ఇటీవల కాలంలో సీక్వెల్ సినిమాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా మంచి సక్సెస్ అయింది అంటే వెంటనే ఆ సినిమాకు సీక్వెల్ సినిమాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సీక్వెల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగ మరికొన్ని షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. అయితే గతంలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలకు కూడా సీక్వెల్ ప్రకటిస్తూ దర్శక నిర్మాతలు అభిమానులను సందడి చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఎన్టీఆర్(NTR) అభిమానులు అదుర్స్ సినిమా సీక్వెల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా ఈ సినిమా సీక్వెల్ గురించి ఎన్నో రకాల వార్తలు తెరపైకి వచ్చాయి.
తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి నిర్మాత కోన వెంకట (Kona Venkat)చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కోన వెంకట్ బ్యాండ్ మేళం సినిమా గ్లింప్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ నుంచి అదుర్స్ 2 (Adhurs 2)గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు కోన వెంకట సమాధానం చెబుతూ నిన్ననే డైరెక్టర్ వివి వినాయక్ అదుర్స్ సీక్వెల్ గురించి చాలామంది అడుగుతూనే ఉన్నారు. మనం ఇది చేద్దాం అంటూ తనతో చెప్పారని తెలిపారు. అయితే నా దగ్గర ఒక అరగంటకు సరిపడే కథ కూడా ఉందని కోన వెంకట తెలియజేశారు.
దర్శకుడు వినాయక్ సీక్వెల్ ఆలోచన
ఇక అదుర్స్ సీక్వెల్ గురించి ఇప్పటికే తాను తారక్ తో మాట్లాడానని ఆయన కూడా ప్రస్తుతం కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ కమిట్మెంట్స్ పూర్తి అయిన తర్వాత తప్పకుండా సీక్వెల్ సినిమా చేద్దామంటూ చెప్పినట్టు కోన వెంకట్ తెలియచేశారు. ఇలా సూపర్ హిట్ సినిమా అదుర్స్ సీక్వెల్ రాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చారి అనే పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. బ్రహ్మానందం ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి.
డ్రాగన్ పనులలో బిజీగా తారక్..
ఎన్టీఆర్ కమిట్మెంట్స్ తర్వాతే సీక్వెల్
ఇక సీక్వెల్ గురించి ఇలాంటి అప్డేట్ రావడంతో చారి మళ్ళీ రాబోతున్నాడు అంటూ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా అనంతరం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో కూడా చేయబోతున్నారు అదేవిధంగా దేవర 2 సినిమా కూడా రాబోతున్న సంగతి తెలిసిందే .ఈ సినిమాల షూటింగ్ పనులు పూర్తి అయిన అనంతరమే అదుర్స్ 2 ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నయనతార, షీలా కౌర్ నటించిన విషయం తెలిసిందే.
మొత్తానికి అదుర్స్ సినిమాకు సీక్వెల్ వస్తుందనే వార్తతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.


