
📌 Key Points
- అడివి శేష్ ‘డెకాయిట్’ సినిమాకు పాజిటివ్ టాక్, ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.
- మేజర్ సినిమా సమయంలో కార్ టెస్ట్ డ్రైవ్ కోసం ఇంటి ముందు ఉండగా జరిగిన గొడవ.
- కారులో వచ్చిన వ్యక్తి ఇంగ్లీష్ బూతులతో దూషించడంతో శేష్ ఆగ్రహం.
- ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడటంతో ఆ వ్యక్తిని గట్టిగా కొట్టిన అడివి శేష్.
టాలీవుడ్ సెన్సేషన్ అడివి శేష్ గురించి ఒక సంచలన వార్త! ఆయన ఒక వ్యక్తిని రోడ్డుపై కొట్టారట! అసలేం జరిగిందో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.
అడివి శేష్ తాజా చిత్రం ‘డెకాయిట్’
Adivi Sesh : వరుస హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న అడివి శేష్ తాజాగా డెకాయిట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమాకు శేష్ బాగానే ప్రమోషన్స్ చేసి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడివి శేష్ మేజర్ సినిమా సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటన తెలిపాడు.
మేజర్ సినిమా సమయంలో షాకింగ్ ఘటన
అడివి శేష్ మాట్లాడుతూ.. నాకు మైండ్ లో ఇంకో చిప్ ఉంది. ఆ చిప్ దొబ్బింది అంటే మాములుగా ఉండదు. మేజర్ సమయంలో ఒక కార్ టెస్ట్ డ్రైవింగ్ కోసం మా ఇంటి ముందు ఉన్నా. కార్ డీలర్ షిప్ వాళ్ళు కార్ తీసుకొచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడుతున్న ఇంటి బయట. రోడ్డు మధ్యలోనే ఉన్నాము. అంతలో కార్ లో ఒక వ్యక్తి వస్తున్నాడు. కార్ వస్తుందని కదా అని చూసి నేను పక్కకు జరుగుతున్నా. అయినా కార్ తొలి వ్యక్తి గట్టిగా హారన్ కొడుతున్నాడు.
రోడ్డుపై వ్యక్తిని కొట్టిన అడివి శేష్
నేను వెళ్తున్నాను అని చేత్తో చూపించి పక్కకు వెళ్తుంటే అతను కార్ గ్లాస్ దించి.. నువ్వు యాక్టర్ అయితే మాత్రం అదీ ఇదీ అంటూ పచ్చి ఇంగ్లీష్ బూతులతో తిట్టాడు. దాంతో నాకు కోపం వచ్చి నేను కార్ దగరికి వెళ్లి డోర్ తీసి కార్ నుంచి దిగు అన్నా. వాడు భయంగానే కిందకు దిగాడు. వాడు నాకంటే పొట్టిగా ఉన్నాడు, భయపడుతున్నాడు కొట్టడం ఎందుకు అనుకున్నా కానీ నా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడాడు. అంతే గట్టిగా కొట్టా. వెంటనే కార్ తీసుకొని వెళ్ళిపోయాడు అని తెలిపాడు.
అడివి శేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి మేము ఆసక్తిగా ఉన్నాము. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


