
📌 Key Points
- ఐశ్వర్య రాజేష్ నటించిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.
- సంక్రాంతికి విడుదలైన సినిమాలో వెంకటేష్‌తో కలిసి నటించినప్పటికీ అవకాశాలు రాలేదు.
- తెలుగులో అవకాశాలు రాకపోవడంపై ఐశ్వర్య రాజేష్ ఆవేదన వ్యక్తం చేసింది.
- ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య రాజేష్ ‘ఒరు సుకుమారి’ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్‌లో అవకాశాలు లేక నిరాశ చెందుతున్నారు. ఆమె నటించిన కొన్ని సినిమాలు విజయవంతమైనప్పటికీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగులో ఐశ్వర్య రాజేష్‌కు నిరాశ
Aishwarya Rajesh : టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కొత్త హీరోయిన్ల ఎంట్రీ కామన్.. అయితే ఇక్కడ కొన్ని సినిమాలతో బాగా సక్సెస్ అయిన హీరోయిన్లు కూడా ఉన్నారు.. మరోవైపు ఒక్క సినిమాతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన హీరోయిన్ సైతం ఉన్నారు. ముఖ్యంగా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లు ఇక్కడ స్టార్ ఇమేజె ని సొంతం చేసుకుంటున్నారు.. అలాంటివారిలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఒకటి. గతంలో ఆమె ఎన్ని సినిమాలు చేసినా సరే.. గత ఏడాది రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఆ మూవీ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.. ఒక్క సినిమా కూడా రాలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఈ విషయాన్ని బయట పెట్టింది. తాజాగా ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..
ఐశ్వర్య రాజేష్ కు ఒక్క అవకాశం రాలేదా..?
సక్సెస్ అయినప్పటికీ అవకాశాలు కరువు
గతంలో ఈమె కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఆ మూవీ జనాలను పెద్దగా ఆకట్టుకోకపోయినా ఐశ్వర్య రాజేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబట్టడంతో పాటుగా వెంకటేష్ లాంటి హీరో సరసన నటించడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా పెరిగింది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ తెలుగులో పెద్దగా అవకాశాలు వచ్చినట్లు కనిపించలేదు.. ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ తెలుగులో అవకాశాలు రాకపోవడం పై ఆవేదన వ్యక్తం చేస్తుంది.. దాంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.. ఈమెకు ఎందుకు తెలుగులో ఆఫర్స్ రావడం లేదు అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి..
తమిళ చిత్రాలపై దృష్టి పెట్టిన ఐశ్వర్య
స్టార్ హీరోలతో నటించి సక్సెస్ అవడం అంటే మామూలు విషయం కాదు.. దానికి అదృష్టం కూడా ఉండాలి అని సినీ పెద్దలు అంటుంటారు.. నిజానికి ఈ అమ్మడుకు అదృష్టం ఉన్న ఆఫర్లు పెద్దగా రాలేదు.. దాంతో ఈమె చిన్న హీరోలు సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా మారిందని సమాచారం. యువ నటుడు తిరువీర్‌తో కలిసి నటించే అవకాశం లభించింది. ఒకవేళ తెలుగు దర్శకులకు నా ప్రతీభపై ఏదేని సందేహం ఉండివుండొచ్చునని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టింది.. ‘ఒరు సుకుమారి’ మూవీ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.. ఈ మూవీ గనక భారీ సక్సెస్ అయితే మాత్రం కచ్చితంగా ఈమెకు మళ్ళీ ఆఫర్స్ క్యూ కట్టే అవకాశం కూడా ఉంది.. మరి ఈ చిత్రం ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ, ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆమె టాలీవుడ్‌లో మళ్లీ ఎప్పుడు కనిపిస్తారో చూడాలి.


