|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 Public Reaction: అఖండ 2పై పబ్లిక్ రియాక్షన్.. అసలు వీరు మారరా?

Published: 12-12-2025, 7:08 AM
Akhanda 2 Public Reaction: అఖండ 2పై పబ్లిక్ రియాక్షన్.. అసలు వీరు మారరా?
  • అఖండ 2 సినిమాకు మిక్స్డ్ టాక్, రొటీన్ కథతో బోయపాటి సాగదీసారని విమర్శలు.
  • బాలయ్య అభిమానులు సంతోషించినా, సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది ఒక పరీక్ష లాంటిదని అభిప్రాయం.
  • బోయపాటి, తమన్‌ల రొటీన్ తీరు మారాలని పలువురు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
  • అఘోర పాత్ర హైలైట్ అయినప్పటికీ, తక్కువ నిడివి ఉండటం అభిమానులను నిరాశపరిచింది.

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో అఖండ 2 సినిమా విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. రొటీన్ కథ, లాజిక్ లేని సన్నివేశాలు, తమన్ బీజీఎం నిరాశపరిచాయని ప్రేక్షకులు చెబుతున్నారు. బాలయ్య అభిమానులు ఎంజాయ్ చేసినా, సాధారణ ప్రేక్షకులకు సినిమా ఒక పరీక్షలా అనిపించింది.

అఖండ 2 మిశ్రమ స్పందన – కారణాలు

Akhanda 2 Public Reaction: బాలకృష్ణ బోయపాటి కాంబోలో సినిమా అంటేనే సినిమా పట్ల మంచి అంచనాలు ఉంటాయి. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక తాజాగా ఆఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రొటీన్ కథతో బోయపాటి ఈ సినిమాని సాగదీసారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాలకృష్ణ అభిమానులు మాత్రం సినిమా అద్భుతంగా ఉంది అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఈ సినిమాలో వైరస్ ను చంపే యాంటీ డోట్ ప్రజలకు ఎలా చేరవేయాలనే ఒక చిన్న పాయింట్ తో ఈ సినిమాని సాగదీసారని చెప్పాలి. అఖండ 2 సినిమాను కేవలం బాలకృష్ణ అఘోర పాత్ర కోసమే చూడాలి తప్పితే కొత్త కంటెంట్ ఏమి లేదని తెలుస్తోంది. ఒక బాలయ్య అభిమానులకు మాత్రమే ఈ సినిమా మంచి ఊపునిస్తుంది కానీ ప్రేక్షకులకు మాత్రం ఒక చిన్న పరీక్ష లాంటిదే అని చెప్పాలి. ఈ సినిమా కథలో లాజిక్ లేకుండా కొన్ని సన్నివేశాలను పెట్టడంతో ప్రేక్షకులు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనే చెప్పాలి. ఇక తమన్ బిజీఏం కూడా కాస్త ఎబెట్టుగానే అనిపించింది.

బోయపాటి, తమన్‌ల రొటీన్ ఫార్ములా

ఇలా బోయపాటి తమన్ బాలయ్య కాంబినేషన్లో అఖండ 2 సినిమా చూస్తుంటే కొత్త సినిమా చూసిన భావన ఏమాత్రం కలగలేదని ఈ విషయంలో వీరి తీరు మార్చుకోవాల్సిందేనని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య కాకుండా ఏ హీరో అయినా నటించి ఉంటే ఇంత హైప్ఉండేది కాదని కూడా స్పష్టం అవుతుంది. బాలకృష్ణ సినిమాల విషయంలో తమన్ బోయపాటి ఇద్దరు కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అఖండ 2 బాలయ్య అభిమానులకు మంచి ఊపు ఇచ్చిన సాధారణ ప్రేక్షకులకు మాత్రం పరవాలేదు అనే భావనను కలిగిస్తుంది.

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం లో నటించిన సంగతి తెలిసిందే. బాలమురళీకృష్ణ ఎమ్మెల్యేగా ఒక పాత్రలో నటించారు. మరొక పాత్రలో ఆ ఘోరంగా కనిపిస్తారు. అఘోర పాత్ర హైలెట్ అనిపించిన ఈ పాత్రకు సంబంధించి ఎక్కువ నిడివి లేకపోవటం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే బాలకృష్ణ కూతురి పాత్రలో బాలీవుడ్ నటి హర్షాలి మల్హోత్రా జనని అనే పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్పే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఇక విలన్ పాత్రలో నటించిన ఆది పినిశెట్టిని చంపేయడం కూడా కాస్త సిల్లీగానే ఉందని చెప్పాలి.

అఘోర పాత్ర హైలైట్ అయినా నిడివి తక్కువ

మొత్తం మీద, అఖండ 2 బాలయ్య అభిమానులకు ఉత్సాహాన్నిచ్చినా, సాధారణ ప్రేక్షకులు మాత్రం నిరాశ చెందారు. బోయపాటి, తమన్, బాలకృష్ణల రొటీన్ పంథా మారాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే మంచి విజయాలు సాధించగలరని విశ్లేషకుల భావన.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.