
గత సంవత్సరం నవంబర్‌లో అఖిల్ అక్కినేని జైనబ్ రవ్జీని నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా వారి పెళ్లి గురించి జూన్ 6 తేదీని ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లేదా రాజస్థాన్‌లో వారి పెళ్లి జరుగుతుందని టాలీవుడ్‌లో వినిపిస్తోంది.
Key Points
అఖిల్ అక్కినేని మరియు జైనబ్ రవ్జీ నిశ్చితార్థం గురించి సమాచారం.
జూన్ 6న వారి వివాహం జరుగుతుందని వార్తలు.
హైదరాబాద్ లేదా రాజస్థాన్‌లో పెళ్లి వేడుక జరుగుతుందని అంచనా.
ఈ వేడుక కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్యే జరుగుతుందని తెలుస్తోంది.
అఖిల్-జైనబ్ నిశ్చితార్థం
Akhil Akkineni : గత సంవత్సరం నవంబర్ లో అక్కినేని అఖిల్ జైనబ్ రవ్జీ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించాడు. జైనబ్ రవ్జీ అనే అమ్మాయిని అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం.
నిశ్చితార్థం తర్వాత ఈ ప్రేమ పక్షులు పలుమార్లు మీడియా కంట పడ్డారు. ఇటీవల విదేశాలకు వెళ్లి జైనాబ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. అయితే తాజాగా వీరి పెళ్లి గురించి టాక్ వినిపిస్తుంది.
పెళ్లి తేదీ గురించి ఊహాగానాలు
వేడుక వివరాలు
అఖిల్ – జైనాబ్ ల పెళ్లి జూన్ 6న జరగబోతుందని సమాచారం. హైదరాబాద్ లేదా రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరుగుతుందని టాలీవుడ్ లో వినిపిస్తుంది. కేవలం ఇటు కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి వేడుక జరగనుందని తెలుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అక్కినేని ఫ్యామిలీ ఈ రూమర్ పై స్పందిస్తుందేమో చూడాలి.
ప్రస్తుతం ఈ వార్తలపై అధికారిక ప్రకటన లేదు. అఖిల్ అక్కినేని కుటుంబం ఈ రూమర్స్ పై స్పందిస్తుందో లేదో చూడాలి. మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సిందే.


