
📌 Key Points
- అల్లు అర్జున్ తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
- తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు వాడకూడదని ఆయన కోరారు.
- అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారించనుంది.
- ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు వాడుతున్నారని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైకోర్టుకు అల్లు అర్జున్ ఎందుకు?
Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పుష్ప మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆ మూవీ తర్వాత తన లైఫ్ పూర్తిగా మారిపోయింది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ కు ఆ మూవీ ఎంతగా క్రేజ్ ను తీసుకొని వచ్చిందో. అలాగే వివాదాలను కూడా తీసుకొని వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎక్కడా వెనకడుగు వేయని బన్నీ తన పని ఏంటో తాను చేసుకుంటూ ప్రస్తుతం పాన్ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది? హైకోర్టుకు అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళాడు? దీని గురించి కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు చర్యలు
తన వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవడానికి హీరో అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా తన పేరును, ఫోటోలను, వీడియోలను అలాగే వాయిస్ నోట్లను ఎక్కడ వాడకూడదు.. నిషేదించాలని డిమాండ్ చేస్తూ కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ జరపనుంది . ఈ పిటిషన్ను తుషారావు గేదెల జస్టిస్ నేతృత్వంలో విచారణ జరగనుంది. ఇప్పటికే చాలామంది హీరోలు ఇలా తమ పేర్లను అనుమతి లేకుండా వాడకూడదు అని కోర్టు మెట్లెక్కారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కానీ కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ మంచి నిర్ణయం తీసుకున్నారు అని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..
అల్లు అర్జున్ తదుపరి చిత్రాలు
పుష్ప 2 మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీ తో రాకా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో దాదాపు 5 మంది హీరోయిన్లు ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు సగానికి పైగా పూర్తయినట్లు తెలుస్తుంది. త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంటుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, అలాగే టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. గతంలో ఎన్నడు కనిపించిన విధంగా అల్లు అర్జున్ ఇందులో కనిపిస్తాడని పోస్టర్ని చూస్తేనే తెలుస్తుంది.. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎలా కనిపించబోతున్నాడు అన్నది తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే..
అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించడం ఆయన అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఆయన ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.


