|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అట్లీ- బన్ని సినిమా అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కి పునకాలు గ్యారెంటీ!

Published: 22-05-2025, 2:26 AM
అట్లీ- బన్ని సినిమా అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కి పునకాలు గ్యారెంటీ!

అల్లు అర్జున్ మరియు అట్లీ కలిసి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని, భారీ బడ్జెట్ తో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని సమాచారం.

Key Points

1

అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్ లో అంతర్జాతీయ స్థాయి సినిమా

2

అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం, ఒక పాత్ర యానిమేటెడ్ రోల్

4

జూన్ లో షూటింగ్ ప్రారంభం, ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్

అట్లీ-బన్ని కాంబినేషన్ సినిమా తాజా సమాచారం

హీరో అల్లు అర్జున్ (Allu Arjun), దర్శకుడు అట్లీ (Atlee)ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. తమ కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో రానున్న సినిమా పనులను స్పీడప్‌ చేశారు. తాజాగా ఈ చిత్రం ప్రీ డక్షన్‌ పనుల నిమిత్తమై అల్లు అర్జున్‌ను కలిసేందుకు హైదారాబాద్‌ వచ్చారు అట్లీ.

త్రిపాత్రాభినయం మరియు యానిమేటెడ్ పాత్ర

వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను ముగించేసి, జూన్‌లో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలన్నది వీరి ప్లాన్‌ అని సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారట.  ఈ మూడు పాత్రల్లో ఒకటి యానిమేటెడ్‌ రోల్‌ అనే టాక్‌ వినిపిస్తోంది.  ఫ్యాన్స్‌కి పునకాలు తెప్పించే సన్నివేశాలో ఇందులో చాలా ఉండబోతున్నాయట.

భారీ బడ్జెట్ మరియు అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్

ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చారిత్రాత్మక చిత్రంలో యాక్షన్‌ సీన్స్‌ వేరే లెవల్‌లో ఉంటాయట.   గ్రాఫిక్స్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని చిత్రబృందం ముందు నుంచి చెబుతుంది. రూ.700 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.   సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో  జాన్వీ కపూర్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటించబోతున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్ లోని ఈ సినిమా భారీ అంచనాలను ఏర్పరుస్తుంది. జూన్ లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ఫ్యాన్స్ కి పునకాలు పంచుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.