|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విష్ణు ‘VV’ స్టైల్: బన్నీ ఫ్యాన్స్ ఫైర్! ‘AA’కు పోటీనా? దుమారం రేపుతున్న విన్యాసం!

Published: 10-01-2026, 7:00 AM
విష్ణు 'VV' స్టైల్: బన్నీ ఫ్యాన్స్ ఫైర్! 'AA'కు పోటీనా? దుమారం రేపుతున్న విన్యాసం!
  • శ్రీ విష్ణు కొత్త సినిమా ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరిలో విడుదల కానుంది.
  • సినిమాలోని ‘దేకో విష్ణు విన్యాసం’ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
  • పాటలో శ్రీ విష్ణు సిగ్నేచర్ మూమెంట్ ‘VV’ అల్లు అర్జున్ ‘AA’ను గుర్తు చేస్తోందని బన్నీ అభిమానుల ఆగ్రహం.
  • శ్రీ విష్ణు గతంలో ఇతర హీరోల సినిమాల్లో కూడా నటించారు.

టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు తన కొత్త సినిమా ‘విష్ణు విన్యాసం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే, ఈ సినిమాలోని పాటలో ఆయన సిగ్నేచర్ మూమెంట్ అల్లు అర్జున్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం.

విష్ణు విన్యాసం సినిమా విశేషాలు

Allu Arjun fans: టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న వారిలో నటుడు శ్రీ విష్ణు(Sreevishnu) ఒకరు. ఇటీవల వరుస సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకుంటున్న శ్రీ విష్ణు త్వరలోనే విష్ణు విన్యాసం(Vishnu Vinyasam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. యదునాథ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సుమంత్ నాయుడు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం వరుస అప్డేట్స్ తెలియజేస్తూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక ఇటీవల ఈ సినిమా నుంచి “దేకో విష్ణు విన్యాసం” అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ అభిమానులు శ్రీ విష్ణు ఫాన్స్ పై కాస్త గుర్రుగా ఉన్నారు. శ్రీ విష్ణు సినిమా పై అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే..

‘దేకో విష్ణు విన్యాసం’ పాట విడుదల

అల్లు అర్జున్ తన సిగ్నేచర్ మూమెంట్”AA” అంటూ చాలా స్టైలిష్ గా రాస్తుంటారు అలాగే శ్రీ విష్ణు కూడా ఈ పాటలో సిగ్నేచర్ మూమెంట్ “VV “అంటూ స్టైలిష్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే మీరు రాసింది AA అని మాకు తెలుసు ..ఇలా బాగా కవర్ చేసారు అంటూ కొంతమంది ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. ఇలా అల్లు అర్జున్ సిగ్నేచర్ మూమెంట్ స్టైల్ లో ఈయన విష్ణు విన్యాసం పాటను ప్రమోట్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో పట్ల బన్నీ అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలా ఈ సినిమా నుంచి విడుదల చేసిన పస్ట్ సింగిల్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. హీరోకి జ్యోతిష్యంపై ఉండే నమ్మకాన్ని తెలియపరుస్తూ ఈ పాట కొనసాగుతుందని చెప్పాలి. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా ఈ పాటను శ్రీకృష్ణ పాడారు..ఇక ఈ సినిమాకు రధన్ సంగీతం అందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయన సారిక ,బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. ఇలా శ్రీ విష్ణు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాలలో కూడా క్యామియో పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాలో కూడా గెస్ట్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం

శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులు, ఈ వివాదంపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ సినిమా శ్రీ విష్ణు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందా అనేది వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.