
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్ళికి అల్లు అర్జున్ అదిరిపోయే గిఫ్ట్!
- రిసెప్షన్‌లో బహుమతిగా ఖరీదైన కారును ఇవ్వనున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
- పుష్ప సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మధ్య ఏర్పడిన స్నేహబంధం.
- మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్, సినీ, రాజకీయ ప్రముఖుల హాజరు.
టాలీవుడ్ లో మరో జంట ఒక్కటైంది! విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఈ జంటకు ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని సమాచారం.
విజయ్, రష్మికల పెళ్లి వేడుకలు!
టాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తెలుగు తారలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అభిమానులకు కనుల విందు చేస్తున్నారు. ఈమధ్య కాలంలో హీరోయిన్ సమంత, స్టార్ డైరక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి బంధంతో ఒక్కటడయ్యారు. ఇక తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నఇద్దరు ప్రేమించి పెళ్లాడారు.
ఈ నెలలో అల్లు అర్జున్ తమ్ముడు, యంగ్ హీరో అల్లు శిరీష్ కూడా తన ప్రేమికురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే పెళ్లిపనులు మొదలయ్యాయి. అల్లు శిరీష్ మంగళ స్నానాల కార్యక్రమానికి విజయ్ రష్మిక కూడా హాజరయ్యారు.
పెళ్లి తరువాత విజయ్ రష్మి జంట తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అల్లు శిరీష్ హల్దీ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ నుంచి విరోషి జంట దేవరకొండ సొంత ఊరికి వెళ్లి.. అక్క సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారు. ఊరందరికి భోజనాలు కూడా పెట్టించారు.
అల్లు అర్జున్ ఇవ్వబోయే సర్ ప్రైజ్ గిఫ్ట్ అదేనా?
ఈమధ్యలో వారు అల్లు అర్జున ఇంటికి వెళ్లి.. అల్లు శిరీష్ మంగళ స్నాలా వేడుకల్లో పాల్గొన్నారుు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం విరోషి జంట భారి స్థాయిలో రిసెప్షన్ ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు భారీ స్థాయిలో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవ్వబోతున్నారు. ఈక్రమంలో ఈ జంట అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లతో కలిసి కొంతసేపు మాట్లాడినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఈ నూతన దంపతులకు ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. రిసెప్షన్ రోజున ఖరీదైన కారును బహుమతిగా అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఆ కారు ఏ బ్రాండ్‌కు చెందినదో అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. రిసెప్షన్ కార్యక్రమంలోనే ఆ బహుమతిని అందజేయనున్నట్లు తెలుస్తోంది.
పుష్ప నుండి మొదలైన స్నేహ బంధం!
మరికొంత మంది వాదన ప్రకారం ఇద్దరికి డైమండ్ రింగ్స్ గు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. రష్మిక మందాన, అల్లు అర్జున్ కలిసి పుష్ప సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. మంచి స్నేహితులుగా మారిపోయారు.
మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ జంట రిసెప్షన్ వేడుక ఘనంగా జరగనుంది. అల్లు అర్జున్ తన తమ్ముడు అల్లు శిరీష్ వివాహ కార్యక్రమం ఉన్నప్పటికీ, విజయ్–రష్మిక రిసెప్షన్‌కు హాజరయ్యేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చూడాలి మరి.. నిజంగా అల్లు అర్జున్ విజయ్, రష్మికలకు కారు భహుమతిగా ఇస్తాడా? ఏక ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్ ప్రచారం మాత్రమేనా?
అల్లు అర్జున్ గిఫ్ట్ గురించి టాలీవుడ్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అసలు ఆ గిఫ్ట్ ఏమిటో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


