
📌 Key Points
- అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి జపాన్లో పుష్ప 2 ప్రమోషన్స్ ప్రారంభించారు.
- జనవరి 16న జపాన్లో ‘పుష్ప కున్రిన్’ పేరుతో విడుదల కానున్న పుష్ప 2 సినిమా.
- సుకుమార్, రష్మిక మందన్న కూడా ప్రమోషన్లలో పాల్గొనడానికి జపాన్ వెళ్లనున్నారు.
- పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లారు. పుష్ప 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన జపాన్ చేరుకున్నారు. ఈ సినిమా జనవరి 16న జపాన్లో విడుదల కానుంది. అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
జపాన్ లో అల్లు అర్జున్ సందడి
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ప్రస్తుతం జపాన్ (Japan)పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి జపాన్ అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి జపాన్లో అడుగుపెట్టడంతో అక్కడ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పుష్ప సినిమాకు సంబంధించిన పోస్టర్లతో అల్లు అర్జున్ కు ఘన స్వాగతం లభించింది. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప 2 సినిమా జనవరి 16వ తేదీ జపాన్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా జపాన్ లో “పుష్ప కున్రిన్”(Pushpa kunrin) గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి జపాన్ చేరుకున్నారు. ప్రస్తుతం ఈయన జపాన్ లోని టోక్యో నగరంలో ఉన్నారు. ఇక టోక్యో నగరంలోకి అడుగుపెట్టగానే అక్కడి అభిమానులతో బన్నీ ముచ్చటించారు. ఇక ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దర్శకుడు సుకుమార్ (Sukumar) తో పాటు నటి రష్మిక మందన్న (Rashmika Mandanna)కూడా జపాన్ వెళ్ళబోతున్నారని తెలుస్తోంది.. 2024 డిసెంబర్లో విడుదలైన పుష్ప 2 సినిమా సుమారు 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ నేపథ్యంలోనే జపాన్ లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుండడంతో అక్కడ కూడా అదే సక్సెస్ అందుకోవాలని బన్నీ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
జనవరి 16న పుష్ప 2 విడుదల
మరి జపాన్ లో పుష్ప రాజ్ హవా ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా జపాన్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అంటూ కామెంట్ లు పెడుతున్నారు.. ఈ సినిమా 16వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో వారం రోజులపాటు అల్లు అర్జున్ జపాన్లోనే పర్యటించబోతున్నారని సమాచారం. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్ అభిమానులను కూడా కలవనున్నారని తెలుస్తోంది.
లోకేష్ కనగరాజ్ తో బన్నీ..
ప్రమోషన్స్ లో సుకుమార్, రష్మిక
ఇక అల్లు అర్జున్ సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం షూటింగ్ పనులలో బిజీగా ఉంది. ఈ సినిమా 2027 లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ తదుపరి సినిమాలపై కూడా పూర్తిస్థాయిలో దృష్టి సారించారు త్వరలోనే తన తదుపరి సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఈయన మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.
మొత్తానికి, అల్లు అర్జున్ జపాన్ పర్యటన పుష్ప 2 సినిమాకి భారీ విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమా విడుదల కోసం ఎదురుచూస్తూ, మరిన్ని విశేషాల కోసం వేచి చూడండి.


