
యాంకర్ అనసూయ ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసపోయింది. ట్రఫుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్‌సైట్‌లో దుస్తులు ఆర్డర్ చేసి ముందే డబ్బులు చెల్లించింది. కానీ, దుస్తులు రాకపోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Key Points
అనసూయ ట్రఫుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్‌సైట్‌లో దుస్తులు ఆర్డర్ చేసింది.
డబ్బులు చెల్లించినా, దుస్తులు లేదా రీఫండ్ రాలేదు.
ఆన్‌లైన్ మోసానికి గురైనట్లు అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇలాంటి మోసాలకు చాలామంది బాధితులవుతున్నారని తెలిసింది.
ఆన్‌లైన్ షాపింగ్ మోసం
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేవాళ్లలో యాంకర్ అనసూయ ఒకరు. గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేయడంతో పాటు ట్రెండింగ్ టాపిక్స్‌పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈమె కూడా ఆన్‌లైన్‌లో మోసానికి గురైంది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. తన దగ్గర డబ్బులు తీసుకుని, ఇప్పటికీ సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ అసలేం జరిగింది?
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి. మరీ ముఖ్యంగా బట్టల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అనసూయ కూడా ఇలానే నెల క్రితం ట్రఫుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్‌సైట్‌లో కొన్ని దుస్తుల్ని ఆర్డర్ పెట్టింది. ముందే డబ్బులు చెల్లించింది. కానీ ఇప్పటికీ సదరు వస్తువులు రాలేదని, అదే టైంలో రీఫండ్ కూడా రాలేదని చెప్పుకొచ్చింది.
ట్రఫుల్ ఇండియా వెబ్‌సైట్
సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి అప్పనంగా డబ్బులు కొట్టేస్తున్నారని సదరు క్లాతింగ్ వెబ్‌సైట్‌పై అనసూయ మండిపడింది. ఈమెకే కాదు గత కొన్నాళ్లుగా ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురువుతున్నాయి. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు అనసూయ కూడా అదే పనిచేసింది. మరి సదరు క్లాతింగ్ బ్రాండ్ స్పందిస్తుందో లేదో చూడాలి?
అనసూయ ఆవేదన
ప్రస్తుతం అనసూయ.. రెండు తమిళ సినిమాలు చేస్తున్నట్లు ఉంది. అలానే ఒకటి రెండు తెలుగు రియాలిటీ షోల్లోనూ జడ్జిగా వ్యవహరిస్తోంది. చివరగా ‘పుష్ప 2’లో దాక్షాయణిగా కనిపించింది. ఈనెల 24న రిలీజయ్యే ‘హరిహర వీరమల్లు’ చిత్రంలోనూ అనసూయ నటించింది.
అనసూయ అనుభవం చాలా మందికి హెచ్చరిక. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ట్రఫుల్ ఇండియా స్పందించి సమస్య పరిష్కారం చేయాల్సి ఉంది.


