|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ నిజం: ఎన్టీఆర్, డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాస్‌మేట్స్‌! ఇది ఎవరికీ తెలియదు!

Published: 28-01-2026, 12:35 PM
షాకింగ్ నిజం: ఎన్టీఆర్, డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాస్‌మేట్స్‌! ఇది ఎవరికీ తెలియదు!
  • అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 9 సినిమాలు విజయం సాధించాయి.
  • చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
  • అనిల్ రావిపూడి, ఎన్టీఆర్, కేటీఆర్ విజ్ఞాన్ వడ్లమూడి కాలేజీలో కలిసి చదువుకున్నారు.
  • వెంకటేష్‌తో కలిసి సంక్రాంతికి సినిమా రాబోతోందని అనిల్ రావిపూడి తెలిపారు.

దర్శకుడు అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన ఎన్టీఆర్, కేటీఆర్‌తో కలిసి విజ్ఞాన్ వడ్లమూడి కాలేజీలో చదివారనే విషయం తాజాగా వెల్లడించారు. అంతేకాకుండా, వెంకటేష్‌తో తన తదుపరి సినిమా సంక్రాంతికి రానుందని తెలిపారు.

అనిల్ రావిపూడి సినీ కెరీర్ విజయాలు

Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయమెరుగని దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఈయన తన సినీ కెరియర్ లో తొమ్మిది సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ తొమ్మిది సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈయనకు ఇండస్ట్రీలో భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది ప్రతి ఒక్క హీరో కూడా అనిల్ రావిపూడితో సినిమా చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు మంచి సక్సెస్ కావడంతో అనిల్ రావిపూడి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటు సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనిల్ రావిపూడి తన కాలేజీ చదివే రోజులను గుర్తు చేసుకున్నారు. ఈయన విజ్ఞాన్ వడ్లమూడి కాలేజీలో చదివిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తనతో పాటు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రముఖ రాజకీయ నాయకుడు కేటీఆర్ కూడా అదే కాలేజీలో చదివారని తెలియజేశారు. మేమంతా ఓకే కాలేజీలో కలిసి చదువుకున్నామనే విషయాన్ని బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కాలేజీ రోజుల్లో ఎన్టీఆర్, అనిల్ రావిపూడి

ఇలా ఈ ముగ్గురిలో ఒకరు పొలిటికల్ లీడర్ కాగా మరొకరు పాన్ ఇండియా స్టార్ హీరో, మరొకరు స్టార్ డైరెక్టర్ గా కొనసాగడం విశేషం. ఇక కాలేజీలో అనిల్ రావిపూడి అల్లరి గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ అనిల్ రావిపూడితో కలిసి చదువుకున్నారనే విషయం మాత్రం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక అనిల్ రావిపూడి సినీ కెరియర్ విషయానికి వస్తే చిరంజీవితో సూపర్ సక్సెస్ అందుకున్న ఈయన వచ్చే ఎడాది సంక్రాంతికి మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం అనే విషయాన్ని తెలియజేశారు.

వెంకటేష్ తో అనిల్ రావిపూడి సినిమా..

వెంకటేష్‌తో రాబోయే సినిమా

ఇలా వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి సినిమా ఉంటుందనే విషయాన్ని తెలియజేయడంతో ఈయన తదుపరి సినిమా ఏ హీరోతో ఉండబోతుందనే విషయంపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి నాగార్జునతో చేయబోతున్నారంటూ వార్తలు రాగా వెంకటేష్ తోనే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ చేయబోతున్నారంటూ కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి అనిల్ రావిపూడి తదిపరి సినిమా ఏ హీరోతో ఉండబోతోంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

అనిల్ రావిపూడి, ఎన్టీఆర్ కలిసి చదువుకున్నారనే వార్త అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. త్వరలో వెంకటేష్‌తో ఆయన సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.