
📌 Key Points
- అగ్నిప్రమాదం నుండి మార్క్ శంకర్ క్షేమంగా బయటపడటం పట్ల అన్నా సంతోషం వ్యక్తం చేశారు.
- ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి ఫ్రేయాను గుర్తు చేసుకున్నారు.
- అగ్నిమాపక సిబ్బంది రాకముందే పిల్లలను కాపాడిన వారిని అన్నా కొనియాడారు.
- ఇళ్లలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు ఉంచుకోవాలని అన్నా సూచించారు.
పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా తన కుమారుడు మార్క్ శంకర్‌కు ఏడాది క్రితం జరిగిన అగ్నిప్రమాదం గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆ రోజును ఆమె తన కుమారుడి రెండవ పుట్టినరోజుగా అభివర్ణించారు.
మార్క్ శంకర్‌కు తప్పిన ప్రమాదం
Anna Lezhneva: జనసేనాని, సినీ నటుడు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అయితే, తాజాగా ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ అభిమానులను కలచివేస్తోంది. తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఒక ఏడాది క్రితం ఎదుర్కొన్న భయంకరమైన అగ్నిప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె అత్యంత భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఆ రోజును తన కుమారుడికి “రెండవ పుట్టినరోజు”గా ఆమె అభివర్ణించారు.
Read also- Allu Arjun: ‘గంగోత్రి’లో పరికిణి వేసుకుంటే ట్రోల్ చేశారు.. ‘పుష్ప 2’లో చీరతో నేషనల్ అవార్డ్..
అగ్నిప్రమాదంలో మరణించిన చిన్నారి
మెగా వారసుడు అకిరా నందన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని అన్నా ఈ పోస్ట్ పెట్టారు. అకిరా ఎదుగుతున్న తీరును చూసి గర్వపడుతున్నానని చెబుతూనే, సరిగ్గా ఇదే రోజున ఏడాది క్రితం జరిగిన ఒక విషాద ఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. “ఈరోజు మా కుటుంబానికి చాలా భావోద్వేగమైన రోజు. అకిరా పుట్టినరోజు వేడుక ఒకవైపు అయితే, మరోవైపు ఏడాది క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ చావును జయించి వచ్చిన రోజు” అని ఆమె పేర్కొన్నారు.
ఏడాది క్రితం జరిగిన ఒక అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రమాదంలో 10 ఏళ్ల ఫ్రేయా అనే చిన్నారి ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. మార్క్ ఊపిరితిత్తులు కూడా ఆ పొగ కారణంగా దెబ్బతిన్నాయి. “ఆసుపత్రి బెడ్ పక్కన కూర్చుని, నా కొడుకు ఊపిరి తీసుకోవడానికి పడుతున్న ఇబ్బందిని చూసిన క్షణాలు ఏ తల్లికీ రాకూడదు” అంటూ అన్నా తన ఆవేదనను పంచుకున్నారు. దేవుడి దయ వల్ల మార్క్ ప్రాణాలతో బయటపడ్డాడని, నేడు అతను క్షేమంగా ఉండటమే తమకు పెద్ద ఊరటని ఆమె తెలిపారు.
అన్నా లెజ్నెవా విజ్ఞప్తి
Read also- ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన మూవీ టీం..
ఈ ప్రమాద సమయంలో అగ్నిమాపక సిబ్బంది రాకముందే 15 మంది పిల్లలను కాపాడిన నిర్మాణ కార్మికులను అన్నా ఈ సందర్భంగా ప్రశంసించారు. వారు చూపిన ధైర్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, వారే నిజమైన హీరోలని కొనియాడారు. అయితే, ఏడాది గడిచినా ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తులు ఎవరో ఇంకా తెలియకపోవడం, విచారణ ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత బాధను పంచుకోవడమే కాకుండా, సామాజిక బాధ్యతగా అన్నా ఒక ముఖ్యమైన విషయాన్ని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ లేదా ఫైర్ బ్లాంకెట్ వంటి భద్రతా పరికరాలను ఉంచుకోవాలని, ఎవరూ ఇలాంటి ప్రమాదాల బారిన పడకూడదని ఆమె ప్రార్థించారు. ప్రస్తుతం అన్నా లెజ్నెవా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అన్నా లెజ్నెవా తన కుమారుడికి జరిగిన ప్రమాదం గురించి చెబుతూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలో భద్రతా పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇది ప్రతి ఒక్కరికీ ఒక గుణపాఠం.


