
టాలీవుడ్ స్టార్ అనుష్క శెట్టి ‘వేదం’ సినిమా ప్రమోషన్ సమయంలో జరిగిన ఓ సంఘటన మళ్ళీ వార్తల్లో నిలిచింది. పంజాగుట్ట సర్కిల్ లో ఏర్పాటు చేసిన ఆమె పోస్టర్లు 40కి పైగా రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యాయని తెలుస్తోంది.
Key Points
అనుష్క శెట్టి 'వేదం' మూవీ పోస్టర్లు పంజాగుట్ట సర్కిల్‌లో ఏర్పాటు చేశారు.
పోస్టర్లను చూస్తూ 40 కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
ఈ సంఘటన మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘వేదం’ మూవీ ప్రమోషన్ పోస్టర్లు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) అందరికీ సుపరిచితమే. ‘సూపర్’ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చి మొదటి ప్రాజెక్ట్‌తోనే ఘన విజయం అందుకుంది. దీంతో అమ్మడు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అలా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ‘సైజ్ జీరో’ మూవీతో బరువు పెరగడంతో సినిమాలు తగ్గించింది. చివరగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty)చిత్రంలో నటించింది. ప్రస్తుతం ‘ఘాటి’ (Ghati)తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. అనుష్క వేశ్యగా నటించిన ‘వేదం’ విడుదలై పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ మూవీ వచ్చిన సమయంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వేదం’ ప్రమోషన్ కోసం అనుష్క పసుపు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ వాడారు. అయితే పలు చోట్ల హోర్డింగ్ పెట్టారు. అయితే పంజాగుట్ట సర్కిల్‌లో కూడా అనుష్క పోస్టర్లు పెట్టడంతో ఆమెను చూస్తూ ఉండిపోయిన వాహనదారులు యాక్సిడెంట్లు బారిన పడడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఒక్కటి కాదు రెండు దాదాపు 40 యాక్సిడెంట్స్ కావడంతో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్‌ను తొలగించారట. ఇక ఈ వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.
పంజాగుట్ట సర్కిల్‌లోని ప్రమాదాలు
సోషల్ మీడియాలో వైరల్
అనుష్క శెట్టి ‘వేదం’ సినిమా పోస్టర్లు ఎంతటి ప్రభావాన్ని చూపించాయో ఈ సంఘటన చూపిస్తుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.


