
📌 Key Points
- పెన్షన్ల కోసం నిధి పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
- మే 1, 2026 నుండి ఫిజికల్ దరఖాస్తులు స్వీకరించబడవు.
- ఉద్యోగుల పెన్షన్ వివరాలు ముందస్తుగా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
- పెండింగ్ దరఖాస్తులు ఏప్రిల్ 30లోగా సమర్పించాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల మంజూరు ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఇకపై అన్ని పెన్షన్ దరఖాస్తులు నిధి పోర్టల్ ద్వారానే స్వీకరించబడతాయి. ఫిజికల్ దరఖాస్తుల విధానానికి స్వస్తి పలకనుంది.
నిధి పోర్టల్ ద్వారానే పెన్షన్ ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల మంజూరు ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు, జాప్యాన్ని తగ్గించేందుకు మరో కీలక అడుగు వేసింది. ఇక మీదట రాష్ట్రంలోని అన్ని రకాల పెన్షన్ కేసులను నిధి పోర్టల్ ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
మే 1 నుంచి ఫిజికల్ అప్లికేషన్లకు స్వస్తి పలకనుంది ప్రభుత్వం. పోర్టల్ ద్వారానే అప్లికేషన్లను తీసుకునే కొత్త రూల్‌ను అమలు చేయనుంది. ప్రస్తుతం కాగితపు దరఖాస్తుల విధానానికి ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30వ తేదీ 2026 వరకు అందించిన ఫిజికల్ పెన్షన్ ప్రపోజల్స్‌ను మాత్రమే అధికారులు అంగీకరిస్తారు.
ఇక మే 1, 2026 నుంచి ఎలాంటి పేపర్ అప్లికేషన్లు స్వీకరించమని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. మే 1 తర్వాత వచ్చే పెన్షన్ దరఖాస్తులను తప్పనిసరిగా నిధి పోర్టల్ ద్వారానే ఆన్‌లైన్‌లో సమర్పించాలి. పలు శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఫిజికల్ దరఖాస్తులు ఏప్రిల్ 30వ తేదీలోపు సంబంధిత కార్యాలయాలకు సమర్పించాలి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించింది.
మే 1 నుంచి అమలు: 2026, మే 1వ తేదీ నుంచి అన్ని రకాల పెన్షన్ కేసులు నిధి పోర్టల్ ద్వారానే జరగాలి.
ఫిజికల్ దరఖాస్తులకు ఆఖరి గడువు
పేపర్ దరఖాస్తులకు స్వస్తి: ప్రస్తుతం అమల్లో ఉన్న కాగితపు (Physical) దరఖాస్తుల విధానాన్ని ప్రభుత్వం నిలిపివేస్తోంది. ఏప్రిల్ 30, 2026 వరకు అందిన ఫిజికల్ అప్లికేషన్లను మాత్రమే అధికారులు అంగీకరిస్తారు.
ముందస్తు అప్‌లోడ్: ఉద్యోగులు పదవీ విరమణ చేయడానికి ముందే వారి పెన్షన్ వివరాలను నిధి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పెండింగ్ ఫైళ్లు: ప్రస్తుతం వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కాగితపు దరఖాస్తులన్నింటినీ ఈ నెలాఖరులోగా (ఏప్రిల్ 30) సంబంధిత కార్యాలయాలకు సమర్పించాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం.
ముందస్తు అప్‌లోడ్ తప్పనిసరి
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పెన్షన్ ప్రక్రియ సాగుతుంది. పెన్షనర్ తన ఫైల్ ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లోనే ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, డిజిటల్ సంతకాలతో ఫైళ్లు వేగంగా కదులుతాయి. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా పెన్షన్ మంజూరులో జాప్యాన్ని తగ్గించవచ్చు.
రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులకు, జిల్లా అధికారులకు మార్గదర్శకాలను విడుదల చేసింది. మే 1 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిజికల్ అప్లికేషన్లు స్వీకరించరు. పదవీ విరమణకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెబుతున్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఈ నిర్ణయం ద్వారా పెన్షన్ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, పారదర్శకంగా పెన్షన్లు మంజూరు చేయడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.


