|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారా? విజయ్ దేవరకొండ బాటలోనే వీరి పెళ్లి ప్లాన్స్?

Published: 25-02-2026, 5:05 AM
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారా? విజయ్ దేవరకొండ బాటలోనే వీరి పెళ్లి ప్లాన్స్?
  • విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లికి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కలిసి హాజరుకావడం హాట్ టాపిక్.
  • తరుణ్, ఈషాల మధ్య ఏదో ఉందని గతంలో పుకార్లు వచ్చాయి, ఇప్పుడు అవి నిజమయ్యేలా ఉన్నాయి.
  • వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
  • తరుణ్, ఈషా మాత్రం తమ రిలేషన్‌షిప్ గురించి ఇంకా అధికారికంగా స్పందించలేదు.

దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వేడుకలో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్‌షిప్ రూమర్స్

Tarun Eesha: సహజంగా దర్శకుడు చెప్పింది సినిమా లైఫ్ లో హీరో వింటాడు.. కానీ హీరో వేసిన బాటలో ప్రస్తుంతం దర్శకుడు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చూపులతో విజయ్ దేవరకొండను హీరోగా పరిచయం చేసిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు, విజయ్ బాటలో నడుస్తున్నట్లు గా అనిపింస్తుంది. ఎందుకంటే.. గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య పరిచయం ఏర్ఫడి అది ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి దారితీసింది. అయితే ఇప్పుడు అదే పెళ్లికి దర్శకుడు హీరోయిన్ ఇషా రెబ్బతో కలిసి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వీదిద్దరి మధ్య ఏదో వుందని పుకార్లు వస్తున్నాయి. వాటిని బలపరిచేలా తరుణ్ కూడా ఒం శాంతి శాంతి శాంతిః సినిమా సందర్భంతో చెప్పకనే చెప్పారు. అయితే ఈ జంట మరోసారి కలిసి కనిపించడంతో ఈ టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది.

Read also- Uday Kiran: ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత ఏం జరిగిందో తిలిస్తే బిత్తెర పోరారు!.. మరీ ఇంత దారుణమా?

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లిలో కలిసి కనిపించిన జంట

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ వేడుకలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ పుకార్లు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం మరింత ఊపందుకోంది. అయితే విజయ్, రష్మికల లాగా వీళ్లు కూడా పెళ్లి కన్ఫామ్ అయ్యే వరకూ ఎవ్వరికీ చెప్పకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన కొందరు తన హీరో బాటలోనే దర్శుకుడు నడుస్తున్నాండంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read also- Bhogi Firstlook: సంపత్ నంది ‘భోగి’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

పెళ్లి వార్తలపై స్పందించని తరుణ్, ఈషా

తమ రిలేషన్‌షిప్ గురించి కానీ, పెళ్లి గురించి కానీ తరుణ్ భాస్కర్ లేదా ఈషా రెబ్బా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. వీరిద్దరూ మంచి స్నేహితులు కావచ్చు లేదా ప్రొఫెషనల్ కారణాల వల్ల అక్కడ కలిసి ఉండవచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది. నెటిజన్లు మాత్రం ఈ జంట చూడటానికి బాగుందని, త్వరలోనే క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నారు. తరుణ్ భాస్కర్ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని కలిగిన దర్శకుడు/నటుడు, అలాగే ఈషా రెబ్బా తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరి నుంచి స్పందన వచ్చే వరకు ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో చెప్పలేం. వీరిద్దరి పెళ్లి గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ఈ వార్తలపై ఎలా స్పందిస్తారో చూడాలి. అభిమానులు మాత్రం వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారా, పెళ్లి చేసుకుంటారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.